నింగిలోకి ప్రధాని ‘వందేమాతరం’ సందేశం.. స్కైరూట్ విక్రమ్-1 రాకెట్‌లో అరుదైన పేలోడ్

by Kema Shiva Kumar |

హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ ‘విక్రమ్-1’ రాకెట్ ప్రయోగం వేళ మరో అరుదైన ఘట్టం చోటచేసుకోబోతోంది.

నింగిలోకి ప్రధాని ‘వందేమాతరం’ సందేశం.. స్కైరూట్ విక్రమ్-1 రాకెట్‌లో అరుదైన పేలోడ్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) త్వరలో చేపట్టబోయే విక్రమ్-1(Vikram-1) రాకెట్ తొలి టెస్ట్ ఫ్లైట్‌లో ఓ స్పెషల్ పేలోడ్‌ను అంతరిక్షంలోకి పంపనుంది. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ తన స్వహస్తాలతో రాసిన ఓ పోస్ట్‌కార్డ్ రాకెట్ ద్వారా నింగిలోకి వెళ్లనుంది. అయితే, దేశ ప్రైవేట్ అంతరిక్ష రంగానికి సరికొత్త ఊపునిచ్చేలా ప్లాన్ చేసిన మిషన్ ఆగమన్‌ (Mission Aagaman)లో భాగంగా హిస్టోరికల్ ఎక్స్‌పరిమెంట్ జరగబోతోంది.

ఈ మిషన్‌లో భాగంగా ప్రధాని మోదీ స్వయంగా చేతితో వందేమాతరం అని రాసిన ఒక పోస్ట్‌కార్డ్‌ను అంతరిక్షంలోకి పంపనున్నారు. ప్రధాని లేఖతో పాటు ఇస్రో (ISRO) ప్రస్తుత, మాజీ చైర్మన్లు, భారత వ్యోమగాములు, అంతరిక్ష రంగానికి చెందిన ప్రముఖులు, ఇన్వెస్టర్లు, స్కైరూట్ బృందం రాసిన వందలాది హస్తలిఖిత పోస్ట్‌కార్డులను కూడా ఈ రాకెట్ మోసుకెళ్లనుంది. ఈ ప్రయోగంలో భారతదేశ ముగ్గురు అత్యున్నత శాస్త్రవేత్తలు అయిన సర్ సీవీ రామన్, విక్రమ్ సారాభాయ్, ఏపీజే అబ్దుల్ కలాంల మైక్రో-ఆర్ట్ శిల్పాలను కూడా అంతరిక్షంలోకి పంపుతున్నారు. ఈ సూక్ష్మ శిల్పాలను ప్రసిద్ధ మైక్రో ఆర్టిస్ట్ అజయ్ కుమార్ మట్టెవాడ 18 క్యారెట్ల బంగారంతో రూపొందించారు. కాగా, విక్రమ్-1 పూర్తిగా స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన మల్టీ-స్టేజ్ కమర్షియల్ లాంచ్ వెహికల్. ఇది పూర్తిగా కార్బన్ ఫైబర్ బాడీతో, త్రీడీ ప్రింటెడ్ లిక్విడ్ ఇంజన్లతో రూపుదిద్దుకున్నది.

Next Story