అధికారంలో భాగస్వామ్యం ఇస్తాం.. వామపక్షాలకు టీవీకే బంపరాఫర్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-07 10:47:27  IST  )

వామపక్ష నేత వీరపాండియన్ తో టీవీకే నేత నిర్మల్ కుమార్ భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వామపక్షాలు, వీసీకే తమకు మద్దతిస్తాయని నమ్ముతున్నామని చెప్పారు.

అధికారంలో భాగస్వామ్యం ఇస్తాం.. వామపక్షాలకు టీవీకే బంపరాఫర్
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో విజయ్ సర్కారు ఏర్పాటుపై సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. సంఖ్యాబలం, మద్దతు లేఖపై మరో సారి గవర్నర్ న్యాయ సలహా తీసుకుంటున్నారు. లీగల్ అడ్వైజ్ తర్వాత గవర్నర్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నామని గవర్నర్ కు విజయ్ లేఖ ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్ మద్దతు లేఖను కూడా సమర్పించారు. 20 మంది మంత్రుల జాబితాను కూడా గవర్నర్ కు అందజేశారు. గవర్నర్ అధికారిక ప్రకటన కోసం టీవీకే శ్రేణులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు మిగితా సీట్ల కోసం వామపక్షాలతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ మేరకు వామపక్ష నేత వీరపాండియన్ తో టీవీకే నేత నిర్మల్ కుమార్ భేటీ అయ్యారు.

ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వామపక్షాలు, వీసీకే తమకు మద్దతిస్తాయని నమ్ముతున్నామని చెప్పారు. అధికారంలో భాగస్వామ్యం కచ్చితంగా ఇస్తామని చెప్పారు. ఎన్డీఏ కూటమిలోని పార్టీలతో సంప్రదింపులు జరపబోమని స్పష్టం చేశారు. అలాంటి ఉద్దేశం తమకు లేదని క్లారిటీ ఇచ్చారు. రెండు రోజుల్లో అన్ని అంశాలపై క్లారిటీ వస్తుందని తెలిపారు. ఇక ఇప్పటికే డీఎంకే అధినేత స్టాలిన్ తో వామపక్షాల నేతలు సమావేశం అవ్వగా ఆ మీటింగ్ తరవాత వామపక్షాల నిర్ణయాలు మారుతున్నట్టు కనిపిస్తోంది. రేపు వామపక్షాల ఎగ్జిక్యూటివ్ సమావేశం తరవాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఆటో డ్రైవర్ కాదు కోటీశ్వరుడు.. టీవీకే ఎమ్మెల్యే బండారం బట్టబయలు

Next Story