NEET (UG)‌లో తగ్గిన క్వాలిఫైయర్ల సంఖ్య.. NTA కొత్త కటాఫ్ మార్కులు ఇవే!

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-17 12:49:57  IST  )

తాజాగా విడుదలైన నీట్ (యూజీ) 2026 ఫలితాల్లో అన్ని కేటగిరీల్లో క్వాలిఫయర్ల సంఖ్య భారీగా తగ్గింది.

NEET (UG)‌లో తగ్గిన క్వాలిఫైయర్ల సంఖ్య.. NTA కొత్త కటాఫ్ మార్కులు ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా విడుదల చేసిన నీట్ యూజీ (NEET-UG) 2026 ఫలితాల్లో ఓ కీలక మార్పు చోటుచేసుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అన్ని కేటగిరీల్లోనూ అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది. పరీక్ష రాసిన మొత్తం అభ్యర్థులలో అర్హత సాధించిన వారి శాతం తగ్గడంతో, అందుకు తగినట్లుగా ఎన్‌టీఏ కొత్త కటాఫ్ మార్కులను విడుదల చేసింది.

కేటగిరీల వారీగా కొత్త కటాఫ్‌లు ఇలా..

జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు క్వాలిఫైయింగ్‌ను 50వ పర్సంటైల్‌గా నిర్ణయించారు. దీని ప్రకారం కటాఫ్ స్కోర్ పరిధి గత ఏడాదితో పోలిస్తే తగ్గింది. ఇక ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందిన విద్యార్థులకు 40వ పర్సంటైల్‌ను క్వాలిఫైయింగ్ కటాఫ్‌గా ఖరారు చేశారు. అదేవిధంగా దివ్యాంగులు, జనరల్ కేటగిరీకి చెందిన పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 45వ పర్సంటైల్‌ను కటాఫ్‌గా నిర్ణయించారు. అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య తగ్గడం వల్ల ఈ ఏడాది మెడికల్ (MBBS/BDS) కౌన్సిలింగ్ ప్రక్రియలో సీట్ల కేటాయింపు సమీకరణాలు మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బోర్డర్ మార్కులు వచ్చిన విద్యార్థులకు తగ్గిన కటాఫ్ వల్ల కాస్త ఊరట లభించనుంది.

Next Story