దేవాదూల పంపుల సందర్శనను అడ్డుకోవడం హేయమైన చర్య: బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు

by Kodari Anjali |

సమ్మక్క సారక్క ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి నీటిని వృథాగా కిందికి వదిలివేయటం సరైన పద్ధతి కాదు అని ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అన్నారు.

దేవాదూల పంపుల సందర్శనను అడ్డుకోవడం హేయమైన చర్య: బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు
X

దిశ, కన్నాయిగూడెం: బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ దూరదృష్టితో నిర్మించిన తుపాకుల గూడెం సమ్మక్క సారక్క ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి నీటిని వృథాగా కిందికి వదిలివేయటం సరైన పద్ధతి కాదు అని ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమారి లక్ష్మణ్ బాబు అన్నారు. రాబోయే రోజుల్లో ఎన్లివో ప్రభావం ఉంటుందని ప్రభుత్వం చెప్తుంది కానీ ప్రాజెక్టులో నీళ్లు మాత్రం కిందికి వదిలివేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. కిందికి వదలకుండా ప్రాజెక్టు గేట్లు ఎత్తకుండా నిల్వ ఉంచితే మరింత ఉపయోగ ఉంటుంది అన్నారు . కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కాలేశ్వరం గేట్లు ఎత్తి కిందికి వదిలినట్టుగా తుపాకులగూడెం సమ్మక్క సారక్క బ్యారేజీ నీటిని కిందికి వదలటం దుర్మార్గమైన చర్య అని కాకులు మర్రి లక్ష్మణ్ బాబు ప్రభుత్వాన్ని విమర్శించారు. కేసీఆర్ దూర దృష్టితో ఎండాకాలం కూడా నీళ్లు నిలువ ఉండే విధంగా సమ్మక్క సారక్క ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సమ్మక్క సారక్క బ్యారేజీ వల్ల దేవదూల పంపుల వద్ద నీళ్లు ఎత్తిపోసే పరిస్థితి ఉంది. కానీ పది పంపులో గాను ఏడు పంపులను నడిపి మూడు పంపులను రిపేర్ పేరుతో రైతులకు నీళ్లు అందకుండా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు కోసం ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వం దేవదుల నీటిని రైతులకు అందే విధంగా చేయాలని ఈ సందర్భంగా లక్ష్మణ్ బాబు డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు..

దేవదూల ప్రాజెక్టు కింద ఏడు పంపులు నడుస్తున్నాయని అధికారులు చెబుతున్న కూడా పంపులు నడుస్తున్నాయో లేదో ఎంత నిజమో కూడా తెలవని పరిస్థితి నిజాలు ప్రజలకు తెలియజేయటానికి వెళ్తున్న కాకులమర్రి లక్ష్మణ్ బాబుని అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. మంత్రి సీతక్క ఎన్నికల ముందు ములుగు నియోజకవర్గ ప్రజలకు దేవదుల ద్వారా అన్ని మండలాలకు నీళ్లు అందిస్తానన్నారు. కానీ ఇప్పటివరకు ఎందుకు అందించలేదని ప్రశ్నించిన లక్ష్మణ్ బాబు ఈ కార్యక్రమంలో కన్నాయిగూడెం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుబ్బుల సమ్మయ్య, పూజారి కిషోర్, చిన్నికృష్ణ, తాటి కృష్ణ, తుమ్మ మల్లారెడ్డి, కాకులమర్రి ప్రదీప్ రావు, కునురు అశోక్, కొమరం ధనలక్ష్మి, తాడూరు రఘు, కాజా పాషా, యలవర్తి శ్రీనివాసరావు, ఎస్.కె కుర్బా పులుసం పురుషోత్తం, పొదెం కృష్ణ ప్రసాద్, కుమ్మరి చంద్రబాబు, శ్రీనివాసచారి తిరుమల రాంబాబు, నామని తిరుపతి, వెంకటయ్య,శ్రీనివాస్ మంచాల లక్ష్మీనారాయణ, దుర్గం నారాయణ, సుధాకర్, జనగాం రవీందర్, మంచాల లక్ష్మి, పూజారి లలిత, శ్రీనివాస్, దుర్గం రాజేష్, దుర్గం రాజ్ కుమార్, కుమ్మరి రమేష్, తదితర బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story