నా భర్త వ్యవహారానికి పవన్ కల్యాణ్‌కు సంబంధం లేదు: డాక్టర్ గాయత్రి

by Vemula.Srinu Prasad |

విశాఖలో డాక్టర్ గాయత్రి కన్నబిడ్డ కిడ్నాప్ఉదంతంపై తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై బాధితురాలు గాయత్రి స్పందించారు. తన బిడ్డ ఆచూకీ కోసం తాను పోలీసులను ఆశ్రయించానని తెలిపారు...

నా భర్త వ్యవహారానికి పవన్ కల్యాణ్‌కు సంబంధం లేదు:  డాక్టర్ గాయత్రి
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)లో డాక్టర్ గాయత్రి(Doctor Gayathri) కన్నబిడ్డ కిడ్నాప్(Daughter Kidnap) ఉదంతంపై తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై బాధితురాలు గాయత్రి స్పందించారు. తన బిడ్డ ఆచూకీ కోసం తాను పోలీసులను ఆశ్రయించానని తెలిపారు. కొందరు పనిలేని వాళ్లే ఈ వ్యవహారాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ముడిపెడుతూ. తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తన కుటుంబ సమస్యను వాడుకుంటున్నారని గాయత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ కల్యాణ్‌ పై అసత్య ప్రచారాలు

తమ వ్యక్తిగత బాధను, పసిబిడ్డ అదృశ్యంపై జరుగుతున్న పోలీసు విచారణను కొందరు సోషల్ మీడియాలో వక్రీకరిస్తున్నారని డాక్టర్ గాయత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌ను ఇందులో లాగుతూ చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. తన బిడ్డను సురక్షితంగా తిరిగి రప్పించడంపైనే తాము దృష్టి పెట్టామని చెప్పారు. ఈ సమయంలో లేనిపోని రాజకీయ వివాదాలు సృష్టించడం సరికాదని డాక్టర్ గాయత్రి హితవు పలికారు.

కొంతకాలంగా విభేదాలు

కాగా డాక్టర్ గాయత్రి, ఆమె భర్త వెంకట్ సిద్ధార్థల మధ్య గత కొంతకాలంగా కుటుంబ విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుందామని నమ్మించిన భర్త, ఊహించని విధంగా వారి 23 నెలల పసికందును ఎత్తుకుపోయారు. ఈ ఘటనపై తీవ్ర ఆందోళనకు గురైన గాయత్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంకట్ సిద్ధార్థపై కిడ్నాప్ కేసు నమోదైంది. కేసును ఛేదించేందుకు పోలీసులు ముమ్మరంగా చర్యలు చేపట్టారు. అయితే వెంకట్ సిద్ధార్థ తల్లి పవన్ కల్యాణ్ కార్యాలయంలో పని చేస్తున్నందున, ఈ వ్యవహారాన్ని ఆయనకు ముడిపెడుతూ కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. దీంతో బాధితురాలు గాయత్రి క్లారిటీ ఇచ్చారు.

Next Story