- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీగా తగ్గిన వెండి ధర.. కిలో ఎంతంటే?
సిల్వర్, గోల్డ్ కొనుగోలుదారులకు భారీ ఊరట లభించింది.

దిశ, వెబ్ డెస్క్ : సిల్వర్, గోల్డ్ కొనుగోలుదారులకు భారీ ఊరట లభించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో శుక్రవారం వెండి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాల ప్రభావంతో అటు వెండి, ఇటు బంగారం ధరలు ఒకేసారి తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా వెండి ధర ఊహించని విధంగా పడిపోయింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధరపై ఏకంగా రూ. 5,000 మేర భారీగా తగ్గింది. ఈ పతనంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 2,35,000 కు చేరుకుంది. కాగా, ఇదే జూలై మొదటి వారంలో స్థానిక మార్కెట్‌లో వెండి ధర గరిష్టంగా రూ. 2,60,000 మార్కును తాకిన సంగతి తెలిసిందే. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే భారీగా ధరలు దిగిరావడంతో నగల ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెండి బాటలోనే పసిడి ధరలు కూడా ఈరోజు స్వల్పంగా క్షీణించాయి.
24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధరపై రూ. 760 తగ్గి ప్రస్తుతం రూ. 1,42,530 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ. 700 మేర తగ్గి ప్రస్తుతం రూ. 1,30,650 కు చేరింది. గత కొన్ని నెలలుగా ఆకాశాన్నంటుతూ వచ్చిన పసిడి, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఒడిదుడుకులు, దేశీయ మార్కెట్లలో మారిన కొనుగోళ్ల సెంటిమెంట్ కారణంగా కాస్త శాంతించాయి. ముఖ్యంగా వెండి కొనాలనుకునే వారికి ఇది మంచి సమయమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.






