- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పక్కాగా భూముల రీసర్వే నిర్వహించాలి
by Taduka Kalyani |
భూ సమస్యలు తలెత్తకుండా, ప్రతి రైతుకు భూ హక్కులు కల్పించేలా భూమి రీ సర్వే చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు.

X
దిశ, అల్లాదుర్గం : భూ సమస్యలు తలెత్తకుండా, ప్రతి రైతుకు భూ హక్కులు కల్పించేలా భూమి రీ సర్వే చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. మండల కేంద్రమైన అల్లాదుర్గంలోని వెంకటేశ్వర ఆలయంలో నిర్వహించిన భూముల రీసర్వే గ్రామ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులకు భూ వివాదాలు లేకుండా చేసి, ప్రతి భూ కమతానికి భూధార్ అందిస్తామన్నారు. భూ పట్టాలను ప్రక్షాళన చేయాలన్నారు. పక్కాగా భూ రీ సర్వే చేసి హద్దులను నిర్ణయించేందుకు కే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏడి ల్యాండ్ సర్వే కిషన్ ,స్థానిక తహసీల్దార్ మల్లయ్య, ఎంపీడీఓ వేద ప్రకాష్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్, రెవెన్యూ అధికారులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Next Story






