భోజనం నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు..!

by Taduka Kalyani |

విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతతో, మెనూ ప్రకారం అందించాలని ఝరాసంగం ఎంపీడీవో మంజుల సూచించారు.

భోజనం నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు..!
X

దిశ,ఝరాసంగం: విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతతో, మెనూ ప్రకారం అందించాలని ఝరాసంగం ఎంపీడీవో మంజుల సూచించారు. భోజనం నాణ్యతలో ఎలాంటి లోపాలు తలెత్తినా సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులను హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని బర్దిపూర్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించి, ప్రధానోపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా పరిశుభ్రత పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. పాఠశాలల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ప్రధానోపాధ్యాయులకు తెలిపారు. వారి వెంట గ్రామ సర్పంచ్ రాజు, ఏపీవో రాజ్‌కుమార్, కార్యదర్శి శిల్ప, వార్డు సభ్యులు చింతచెట్టు రాజు, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story