మహారాష్ట్ర CM సమక్షంలో సరెండర్.. అభయ్, ఆశన్న సహా పలువురు మావోయిస్టు నేతలు!

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-14 10:59:20  IST  )

మావోయిస్టు తిరుగుబాటు నేత, పొలిట్‌ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ (Mallojula Venugopal) అలియాస్ అభయ్ అలియాస్ సోనూ అలియాస్ భూపతి, మరో 60 మంది మావోయిస్టు పార్టీ నేతలు ఇవాళ సాయంత్రం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (CM Devendra Fadnavis) సమక్షంలో గడ్చిరోలి (Gadchiroli)లో లేదా ముంబాయి (Mumbai)లో సరెండర్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది.

మహారాష్ట్ర CM సమక్షంలో సరెండర్.. అభయ్, ఆశన్న సహా పలువురు మావోయిస్టు నేతలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మావోయిస్టు తిరుగుబాటు నేత, పొలిట్‌ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ (Mallojula Venugopal) అలియాస్ అభయ్ అలియాస్ సోనూ అలియాస్ భూపతి, మరో 60 మంది మావోయిస్టు పార్టీ నేతలు ఇవాళ సాయంత్రం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (CM Devendra Fadnavis) సమక్షంలో గడ్చిరోలి (Gadchiroli)లో లేదా ముంబాయి (Mumbai)లో సరెండర్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే, మావోయిస్టుల లొంగుబాటు నిజమేనని.. వాళ్లంతా గత రాత్రి గడ్చిరోలి పోలీసుల అదుపులో ఉన్నట్లుగా ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ప్రకటించారు. ఇంత పెద్ద సంఖ్యలో నక్సల్స్ లొంగిపోతుండటంతో ఇదే అంశాన్ని భారీ ఎత్తున హైలెట్ చేసేందుకు మహారాష్ట్ర సర్కార్ మీడియా సమావేశానికి ఏర్పాట్లు చేస్తోంది. అదేవిధంగా అదే ప్రెస్‌మీట్‌లో సీపీఐ (మావోయిస్టు) పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ మల్లోజుల వేణగోపాల్ అలియాస్ అభయ్ నోటితో సాయుధ పోరాట విరమణ ప్రకటన చేయించి, వారందరినీ జీవన స్రవంతిలో కలిసినట్లుగా మహారాష్ట్ర సర్కార్ ఓ ప్రకటన విడదుల చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సీసీ సభ్యుడు ఆశన్న సహా పలువురు నేతలు..!

లొంగిపోనున్న మావోయిస్టు నేతల్లో సీసీ సభ్యుడు, నార్త్ సబ్ జోనల్ బ్యూరో చీఫ్ రూపేశ్ అలియాస్ ఆశన్న అలియాస్ తక్కళ్లపల్లి వాసుదేవ రావు (Takkalapalli Vasudeva Rao) సహా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు ముగ్గురు, గడ్చిరోలి, ఉత్తర బస్తర్, మాడ్ డివిజన్లకు చెందిన 10 మంది డివిజన్ కమిటీల సభ్యులు, పలువురు కంపెనీ, ప్లాటూన్ కమాండర్లు, ఏరియా కమిటీ సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వారంతా ఆయుధాలతో లొంగిపోతారా..? పోలీసులు పెట్టబోయే ప్రెస్‌మీట్‌లోనే కొత్త రాజకీయ పార్టీ ప్రకటన చేస్తారా..? అన్నది తెలియాల్సి ఉంది. సాయంత్రం సభలోనే ఈ మొత్తం విషయాలపై క్లారిటీ వస్తుందని మహారాష్ట్ర మీడియా వర్గాలు తెలిపాయి.

Read More: మావోయిస్టు పార్టీ చరిత్రలో సంచలనం.. మహారాష్ట్ర పోలీసుల ఎదుట మల్లోజుల వేణుగోపాల్ సరెండర్

మావోయిస్టు నేత మల్లోజుల సరెండర్.. ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

మావోయిస్టు అమ్ములపొదిలో బిజి‌ఎల్.. చివరి యుద్దానికి ఆయుధాలు సమీకరణ

Next Story