- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టు అమ్ములపొదిలో బిజిఎల్.. చివరి యుద్దానికి ఆయుధాలు సమీకరణ
మావోయిస్టు పార్టీలో ఒక వర్గానికి చెందినవారు లొంగుబాట పడుతుంటే.. మరో వర్గం అంతిమ యుద్దానికి ఆయుధాలు సమీకరించే పనిలో నిమగ్నం అయ్యారు.

దిశ, భద్రాచలం: మావోయిస్టు పార్టీలో ఓ వర్గం లొంగుబాట పడుతుంటే.. మరో వర్గం అంతిమ యుద్దానికి ఆయుధాలు సమీకరించే పనిలో నిమగ్నం అయింది. దీనిలో భాగంగా భారీగా బారెల్ గ్రెనేడ్ లాంచర్ (Barrel grenade launcher) (BGL) ) ఆయుధాలు తయారీకి నడుం బిగించారు. మావోయిస్టులు BGL ఆయుధాన్ని అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. ఇది 300 మీటర్ల పరిధిలోని టార్గెట్‌ను మట్టుబెడుతుంది. అంతే కాకుండా దీని తయారీ చాలా తేలిక కావడంతో స్థానికంగా దొరికే వస్తువులతో ఈ ఆయుధాలను తయారు చేసి మావోయిస్టులు సిద్ధంగా ఉంచుకుంటున్నారు.
లేత్ మిషన్(Lathe Mission)తో పాటు కొన్ని ఐరన్ షీట్స్, స్టీలు గొట్టాలు సమీకరించి ఆయుధ కర్మాగారాలు (Arms factories)ఏర్పాటు చేసుకుని భారీగా BGL తయారీ మొదలుపెట్టారు. అమిత్ షా ప్రకటించినట్లు ఆపరేషన్ కగార్(Operation Kagar)లో భాగంగా అంతిమ యుద్ధం చేయడానికి BGL ఆయుధాలు దోహదపడతాయానే నమ్మకంతో మావోయిస్టులు వేలాది బీగ్ల్ ఆయుధాలను సిద్ధంగా ఉంచుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకూ భద్రతా బలగాలు ఐదు ఆయుధ కర్మాగారాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రతి ఆయుధ కర్మాగారంలో BGL తయారీకి సంబంధించిన పరికరాలు లభ్యం అయ్యాయి.
ఈ బీగ్ల్ ఆయుధాల తయారీని మావోయిస్టులు 18 సంవత్సరాలు క్రితమే ప్రారంభించారు. అయితే ప్రస్తుతం సాంకేతికతను జోడించి, అత్యంత ప్రభావితంగా ఉండేందుకు పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. మావోయిస్టుల వేటలో భాగంగా ఇప్పుడు బలగాలు మావోయిస్టు డంప్‌లు నిర్వీర్యం చేసే పనిలో పడ్డారు. కాగా మావోయిస్టులు ఆయుధాలు తయారీకి నిపుణులను నియమించుకున్నట్లు తెలుస్తుంది. మావోలు సాధారణ రైఫిల్, లేదా మజిల్ లోడింగ్ గన్ ను అప్గ్రేడ్ చేసి దానిలో ఐరన్ పైప్ ఏర్పాటు చేయడం ద్వారా బీగ్ల్ ఆయుధం తయారవుతుంది. కాగా మావోయిస్టులను ధీటుగా ఎదుర్కోవడానికి బలగాలు అండర్ బారెల్ గ్రెనేడ్ లాంచర్(Under-barrel grenade launcher) ఉపయోగిస్తున్నారు. ఇది 600 మీటర్లలోని టార్గెట్‌ను చేరుకుంటుంది.






