మావోయిస్టు నేత మల్లోజుల సరెండర్.. ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-14 09:02:51  IST  )

మావోయిస్టు తిరుగుబాటు నేత, పొలిట్‌ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ లొంగుబాటుపై తాజాగా ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ (Vijaya Sharma) స్పందించారు.

మావోయిస్టు నేత మల్లోజుల సరెండర్.. ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు తిరుగుబాటు నేత, పొలిట్‌ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ లొంగుబాటుపై తాజాగా ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ (Vijaya Sharma) స్పందించారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బస్తర్ ప్రజలు నక్సలిజాన్ని అంతం చేయాలని నిర్ణయించుకున్నారని కామెంట్ చేశారు. గతేడాది ఒక మహిళా పొలిట్ బ్యూరో సభ్యురాలు లొంగిపోయిందని.. నేడు ఆమె భర్త సోదరుడు మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ కూడా జనజీవన స్రవంతిలోకి రావడం సంతోషకరమని అన్నారు. ఇటీవల కాలంలో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన బస్తర్‌ జిల్లాలో ఊహించని రితీలో అభివృద్ధి కార్యక్రమాలు జరగుతున్నాయని గుర్తు చేశారు. ఇక రాబోయే రోజుల్లో కూడా ఇతర మావోయిస్టు నేతలంతా ప్రధాన స్రవంతిలోకి చేరే వారందరినీ తాము మేము స్వాగతిస్తున్నామని అన్నారు. ఇంకా ఆయుధాలు వీడని వారిపై భద్రతా దళాలు చర్యలు తీసుకుంటాయని ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ స్పష్టం చేశారు.

Read More: మహారాష్ట్ర CM సమక్షంలో సరెండర్.. అభయ్, ఆశన్న సహా పలువురు మావోయిస్టు నేతలు!

Next Story