- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిజర్వేషన్ డే విజయవంతం చేయాలి : ఎమ్మెల్సీ కోదండరాం
ఈ నెల 26న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఛత్రపతి సాహూ మహారాజ్ జయంతి సందర్భంగా నిర్వహించే రిజర్వేషన్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు.

దిశ, భీమదేవరపల్లి : ఈ నెల 26న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఛత్రపతి సాహూ మహారాజ్ జయంతి సందర్భంగా నిర్వహించే రిజర్వేషన్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. ఈ మేరకు భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని ప్రజాగ్రంథాలయం వద్ద రిజర్వేషన్ డే పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ 1902లో కొల్హాపూర్ సంస్థానంలో ఛత్రపతి సాహూ మహారాజ్ తొలిసారిగా 50 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని, అదే స్ఫూర్తితో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. ప్రస్తుతం రిజర్వేషన్లను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, వాటి పరిరక్షణ కోసం బహుజన వర్గాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కదిరే కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కవ్వా లక్ష్మారెడ్డి, డ్యాగల సారయ్య, చెప్యాల ప్రకాశ్, వేముల జగదీష్, గొడుగు వజ్రమ్మ, జయ, మహమ్మద్ రషీద్ తదితరులు పాల్గొన్నారు.






