హ‌రీష్ రావు రోజుకు 100 అబ‌ద్దాలు ఆడుతాడు: ప్రభుత్వ విప్, సీహెచ్. విజ‌య‌ర‌మ‌ణారావు

by Ajay Maddhiboyina |

హ‌రీష్ రావు రోజుకు 100 అబ‌ద్దాలు ఆడుతాడని, రేవంత్ రెడ్డి వల్లనే క‌రువు వ‌చ్చింద‌ని ఆయన అబ‌ద్దాలు మాట్లాడుతున్నాడని ప్రభుత్వి విప్, విజయరమణా రావు మండిపడ్డారు. ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వ‌చ్చాక గ‌త మూడేళ్ల నుంచి పంట‌లు బాగా పండాయని, రికార్డు స్థాయిలో పంట‌ల దిగుబ‌డులు వ‌స్తున్నాయి,

హ‌రీష్ రావు రోజుకు 100 అబ‌ద్దాలు ఆడుతాడు: ప్రభుత్వ విప్, సీహెచ్. విజ‌య‌ర‌మ‌ణారావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : హ‌రీష్ రావు రోజుకు 100 అబ‌ద్దాలు ఆడుతాడని, రేవంత్ రెడ్డి వల్లనే క‌రువు వ‌చ్చింద‌ని ఆయన అబ‌ద్దాలు మాట్లాడుతున్నాడని ప్రభుత్వి విప్, విజయరమణా రావు మండిపడ్డారు. ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వ‌చ్చాక గ‌త మూడేళ్ల నుంచి పంట‌లు బాగా పండాయని, రికార్డు స్థాయిలో పంట‌ల దిగుబ‌డులు వ‌స్తున్నాయి, రైతుల్లో సీఎం రేవంత్ రెడ్డి పైన‌ విషం నింపాల‌ని హ‌రీష్ రావు ప్రయ‌త్నం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. కేటీఆర్ ను మించి పోవాల‌ని హ‌రీష్ రావు ఉద్దేశ‌పూర్వకంగా రేవంత్ రెడ్డి పైన విమ‌ర్శలు చేస్తున్నాడని, కేసీఆర్ క‌ట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయిందని విజయరమణా రావు విమర్శించారు.

నీళ్లు నిల్వ ఉంచ‌రాద‌ని ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందని, దాన్నే తమ ప్రభుత్వం అనుస‌రిస్తోందన్నారు. ఎల్ నినో ప్రభావం ప్రపంచ‌వ్యాప్తంగా ఉందని, వ‌రికు బ‌దులు ఆరు త‌డి పంట‌లు వేసుకోవాల‌ని ప్రభుత్వం రైతుల‌కు చెపుతోంది, రైతుల‌కు న‌ష్టం జ‌ర‌గొద్దని ప్రభుత్వం ప్రయ‌త్నాలు చేస్తోందని విజయరమణా రావు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పైన బుర‌ద జ‌ల్లే ప్రయ‌త్నాలు హ‌రీష్ రావు మానుకోవాలని ఆయన హితవు పలికారు. కేసీఆర్ హ‌యాంలో ప‌దేళ్లు క‌రువే రాలేద‌ని ప‌నికి పాలిన కబుర్లు చెపుతున్నాడని, బీఆర్ఎస్ హ‌యాంలో 2014, 2015, 2019 సంవత్సరాల్లో వర్షాలు లేక వ్యవసాయం, తాగునీటి కి తీవ్ర స‌మ‌స్యలు వ‌చ్చాయని విజయరమణా రావు చెప్పారు.

వ‌రి వేస్తే ఉరే అన్నది, ఖ‌మ్మంలో మిర్చి రైతుల‌కు బేడీలు వేసింది, రైతుల‌కు ఎరువులు ఉచితంగా ఇస్తాన‌ని క‌బుర్లు చెప్పి మోసం చేసింది, రైతు బందు ఒక్కటే ఇచ్చి అన్ని ర‌కాల స‌బ్సిడీలు ఎత్తివేసింది కేసీఆర్ అని ఆయన ఆరోపించారు.. చెట్లు, పుట్టలు, సినిమా థియేట‌ర్లు, చివ‌ర‌కు రోడ్లకు కూడా రైతు బంధు ఇచ్చి ప్రజా ధ‌నాన్ని దుర్వినియోగం చేసింది, రైతుల‌ను స‌ర్వనాశ‌నం చేసిన చ‌రిత్ర కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీదని విజయరమణా రావు ఆగ్రహాం వ్యక్తం చేశారు.

Next Story