- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మృత్యుంజయుడిని పరామర్శించిన ప్రధాని మోడీ..
అహ్మదాబాద్‌లో విమాన ప్రమాద (Flight Crash) ఘటనలో మొత్తం 265 మంది దుర్మరణం పాలయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్‌లో విమాన ప్రమాద (Flight Crash) ఘటనలో మొత్తం 265 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ భయానక ఘటనలో ఒకే ఒక్కడు సీట్ నెంబర్ 11లో కూర్చున్న ప్రయాణికుడు రమేష్ విశ్వాస్ కుమార్ (Ramesh Vishwas Kumar) ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతడు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గుజరాత్‌లో ఉన్న తన కుటుంబాన్ని కలిసేందుకు బ్రిటన్ నుంచి విశ్వాస్ ఇండియాకు వచ్చాడు.. తిరగి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విశ్వాస్ సోదరుడు కూడా అదే ఫ్లైట్‌లో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అతని ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ ఘటనా స్థలాన్ని పరిశీలించేందకు ఢిల్లీ నుంచి నేరుగా.. మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతానికి వెళ్లారు. అనంతరం అధికారులతో యాక్సిడెంట్ జరిగిన తీరుపై ఆరా తీశారు. అక్కడి నుంచి అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకుని ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్ కుమార్‌ను ప్రధాని పరామర్శించారు. ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి క్రాష్ అయ్యేంత వరకు ఏం జరిగిందని అతడిని అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది.
Read More..
ప్రమాద స్థలానికి చేరుకున్న ప్రధాని మోడీ.. మృతుల కుటుంబాలకు పరామర్శ
Plane crash: విమానం నుంచి దూకలేదు.. సీటు పక్కకెళ్లిపోయి బతికిపోయి: మృత్యుంజయుడు రమేశ్






