- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాద స్థలానికి చేరుకున్న ప్రధాని మోడీ.. మృతుల కుటుంబాలకు పరామర్శ
ఎయిరిండియా విమానం కూలిన ఘటన యావత్ భారతదేశాన్ని శోకసంద్రంలోకి నెట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: ఎయిరిండియా విమానం కూలిన ఘటన యావత్ భారతదేశాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. ఈ దుర్ఘటనలో మొత్తం 229 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. ఫ్లైట్ బీజే మెడికల్ కాలేజ్ బిల్డింగ్‌పై పడటంతో మరో 24 మంది మెడికోలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు కాసేపటి క్రితం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన ప్రమాదం జరిగిన మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతానికి వెళ్లారు.
ప్రధానితో పాటు ఆయన వెంట కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) కూడా ఉన్నారు. అనంతరం ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను స్పాట్‌లో అందుబాటులో ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాల సంబంధిత కుటుంబాలకు త్వరగా అప్పగించేలా పక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలపై కూడా ఆరా తీశారు. అదేవిధంగా ఫ్లైట్ యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఇక క్షతగాత్రులైన మెడికోలు ఆసుపత్రిలో చికిత్స పొందతుండగా.. పీఎం అక్కడికి నేరుగా వెళ్లి ప్రమాదంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ఘటనా స్థలం నుంచి ఎయిరిండియా ఆపరేషన్స్ సంస్థ టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్‌తో ప్రధాని మాట్లాడినట్లుగా తెలుస్తోంది.
Read More..
ఎయిరిండియా ప్రమాదం.. ట్రాఫిక్ జామ్ ఆమె ప్రాణాలను కాపాడింది!






