ఎయిరిండియా ప్రమాదం.. ట్రాఫిక్ జామ్ ఆమె ప్రాణాలను కాపాడింది!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-13 07:17:54  IST  )

ఆలస్యం.. అమృతం, విషం అనే నానుడీ అందరికి తెలిసిందే. అంటే... ఆలస్యం వల్ల మంచైనా జరుగొచ్చు, చెడైనా జరుగొచ్చని అర్థం.

ఎయిరిండియా ప్రమాదం.. ట్రాఫిక్ జామ్ ఆమె ప్రాణాలను కాపాడింది!
X

దిశ, వెబ్ డెస్క్: ఆలస్యం.. అమృతం, విషం అనే నానుడీ అందరికీ తెలిసిందే. అంటే ఆలస్యం వల్ల మంచైనా జరుగొచ్చు, చెడైనా జరుగొచ్చు. అయితే ఈసారి మాత్రం ఆలస్యం నిస్సందేహంగా అమృతం అనే చెప్పాలి. ఎందుకంటే.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో (Ahmedabad) జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో (Air India Flight Crash) 265 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనలో, ఓ పది నిమిషాల ఆలస్యం మాత్రం ఒక యువతి జీవితాన్ని కాపాడింది.

ఈ విషాదకర సంఘటన దేశ ప్రజల గుండెల్లో గాయంగా మిగిల్చింది. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ (London) గాట్విక్‌ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా AI171 విమానం, టేకాఫ్‌ అయిన కొద్ది క్షణాల్లోనే ఎయిర్‌పోర్ట్ సమీపంలోని నివాస ప్రాంతంపై కుప్పకూలింది. ఈ విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. విమానం కూలిన భవనంలో 24 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 265కి చేరింది.

అయితే పది నిమిషాల ఆలస్యం ఓ యువతి ప్రాణాలను నిలబెట్టింది. భూమి చౌహాన్‌ అనే యువతి అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్లడానికి ఎయిరిండియా (Air India) ఫ్లైట్‌ AI171 బుక్‌ చేసుకుంది. ఎయిర్‌పోర్టుకు చేరుకునే క్రమంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ కారణంగా పది నిమిషాలు ఆలస్యం అయింది. అయితే, అప్పటికే ఫ్లైట్ టేకాఫ్ అవ్వటం, కొన్ని క్షణాల్లోనే అది ప్రమాదానికి గురవ్వటం జరిగిపోయాయి. ఈ ఘటన తలచుకుంటే ఒళ్లు వణుకుతోందని, తను ఆ ఫ్లైట్ ఎక్కలేదని, తనను దేవుడే రక్షించాడని భూమి చౌహాన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కాగా, భూమి చౌహాన్ లండన్‌లో భర్తతో కలిసి నివసిస్తోంది. రెండేళ్ల అనంతరం వెకేషన్‌ కోసం ఇండియా వచ్చింది. తిరుగు ప్రయాణం కోసం ఎయిరిండియా విమానం బుక్ చేసుకోగా, అదృష్టవశాత్తూ ఈ దుర్ఘటన నుంచి బయటపడింది.

Read More..

ప్రమాద స్థలంలో DGCA, AAIB సోదాలు.. సంచలన విషయాలు వెలుగులోకి

Next Story