ప్రమాద స్థలంలో DGCA, AAIB సోదాలు.. సంచలన విషయాలు వెలుగులోకి

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-13 07:16:58  IST  )

అహ్మదాబాద్‌ (Ahmadabad)లో ఎయిరిండియా బోయింగ్‌ 787-8 డ్రీమ్‌ లైనర్‌ ఫ్లైట్ కుప్పకూలిన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)తో పాటు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB) బృందాలు రంగంలోకి దిగాయి.

ప్రమాద స్థలంలో DGCA, AAIB సోదాలు.. సంచలన విషయాలు వెలుగులోకి
X

దిశ, వెబ్‌‌డెస్క్: అహ్మదాబాద్‌ (Ahmadabad)లో ఎయిరిండియా బోయింగ్‌ 787-8 డ్రీమ్‌ లైనర్‌ ఫ్లైట్ కుప్పకూలిన ఘటనపై విచారణ చేపట్టేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)తో పాటు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB) బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగాయి. ఈ మేరకు దర్యాప్తులో భాగంగా గురువారం ఫ్లైట్ కూలిన ప్రాంతంలో రాత్రంతా వారు సోదాలు నిర్వహించారు. ప్రమాదం జరిగిన తీరుపై డీజీసీఏ అధికారులు విశ్లేషణ చేస్తూ ప్రాథమిక నివేదికను సిద్ధం చేస్తున్నారు. ఇంజిన్ ఫెయిల్ అవ్వడంతోనే ప్రమాదం సంభవించిందని.. ఇప్పటికే డీజీసీఏతో పాటు ఏఏఐబీ బృందాలు గర్తించాయి.

అదేవిధంగా టేకాఫ్ సమయంలో ఇంజిన్లు పని చేయకపోవడానికి గల కారణాలపై టెక్నికల్ టీమ్‌ (Technical Team)తో కలిసి ఆరా తీస్తున్నారు. టేకాఫ్ అయిన నిమిషంలోపే ఫ్లైట్ క్రాష్ అవ్వడం.. సాంకేతిక లోపాన్ని ఫ్లైట్ క్రూ గమనించకపోవడంపైనే ప్రధానంగా దర్యాప్తు కొనసాగుతోంది. అదేవిధంగా టేకాఫ్ నుంచి క్రాష్ అయిన ప్రాంతం వరకు డీజీసీఏ అధికారులు డ్రోన్ సర్వే నిర్వహించారు. ఘటనా స్థలాన్ని బ్రిటిష్ ఏవియేషన్ అధికారులతో పాటు ఎయిరిండియా సీఈవో విల్సన్ (CEO Wilson) పరిశీలించారు.

Read More..

ఎయిరిండియా ఫ్లైట్ క్రాష్.. కాసేపట్లో అహ్మదాబాద్‌కు ప్రధాని మోదీ

Next Story