- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Plane crash: విమానం నుంచి దూకలేదు.. సీటు పక్కకెళ్లిపోయి బతికిపోయి: మృత్యుంజయుడు రమేశ్
అహ్మదాబాద్ నుంచి లండన్ లోని గాట్విక్ ఎయిర్ పోర్టు కు వెళ్లాల్సిన బోయింగ్ ఫ్లైట్ AI171 ప్రమాదంలో 265 మందిపైగా దుర్మరణం చెందగా.. ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డ విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: అహ్మదాబాద్ నుంచి లండన్ లోని గాట్విక్ ఎయిర్ పోర్టు కు వెళ్లాల్సిన బోయింగ్ ఫ్లైట్ AI171 ప్రమాదంలో 265 మందిపైగా దుర్మరణం చెందగా.. ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డ విషయం తెలిసిందే. అయితే విమాన ప్రమాదం జరిగినపుడు దాదాపు ఆ ప్రాంతమంతా దాదాపు 1000 డిగ్రీల వేడి వాతావరణం పుట్టినట్లు తెలుస్తోంది. దాదాపు 1.25 లక్షల లీటర్ల ఇంధనం లీక్ కావడంతో ఘటనా స్థలంలో భయానక పరిస్థితి నెలకొంది. అయితే మృత్యుంజయుడు సీటు 11A లో కూర్చున్న విశ్వష్ కుమార్ రమేష్ మాత్రం గాయాలతో బయటపడ్డాడు. తాను ఎలా బయటపడ్డాడో ఆసుపత్రిలో డాక్టర్లకు వివరించాడు
నేను దూకలేదు... సీటు విడిపోయి దూరం వచ్చింది
విమాన ప్రమాద సమయంలో తాను కూడా సీటు బెల్ట్ ధరించానని ఫ్లైట్ కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. విమానం రెండు ముక్కలైంది. ఆ సమయంలో తన సీటు పూర్తిగా విడిపోయి పక్కకు వెళ్లిపోయింది. దీంతో పాటు కొన్ని శిథిలాలు తనకు అడ్డుగా ఉండటంతో మంటల నుంచి తప్పించుకోగలిగాలని డాక్టర్లకు చెప్పాడు. కానీ కొంతమంది విమానం నుంచి దూకేశానని చెబుతున్నారు అది నిజం కాదని అన్నాడు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 232 ప్యాసింజర్లు, 10 మంది క్రూ సిబ్బంది మరణించగా.. ఫ్లైట్ మెడికల్ హాస్టల్ పై పడటంతో 20 మంది పైగా వైద్య విద్యార్థులు మరణించినట్లు సమాచారం. ఈ ఉదయమే ప్రధాని మోదీ ఘటన స్థలాన్ని పరిశీలించి అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో సమీక్ష కూడా నిర్వహించారు. కాగా పైలట్లు సంబంధాలు తెగిపోయే ముందు మేడే కాల్ చేశారని అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై అధికారిక దర్యాప్తు కొనసాగుతోంది.
Read More..






