ఢిల్లీ చర్చిలో ప్రధాని మోడీ క్రిస్మస్ ప్రార్థనలు

by Malleboina Mahesh |   (  Updated:2025-12-25 05:43:39  IST  )

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం ఉదయం ఢిల్లీలోని చారిత్రాత్మక 'క్యాథెడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడెంప్షన్'ను సందర్శించారు.

ఢిల్లీ చర్చిలో ప్రధాని మోడీ క్రిస్మస్ ప్రార్థనలు
X

దిశ, వెబ్ డెస్క్: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) గురువారం ఉదయం ఢిల్లీలోని చారిత్రాత్మక 'క్యాథెడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడెంప్షన్'ను సందర్శించారు. ఢిల్లీ, ఉత్తర భారతదేశం నలుమూలల నుంచి తరలివచ్చిన క్రైస్తవ సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. చర్చికి చేరుకున్న ప్రధానికి బిషప్ పాల్ స్వరూప్, ఇతర మత పెద్దలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా చర్చిలో మారుమోగిన క్రిస్మస్ కేరల్స్, కీర్తనలు భక్తిభావంతో కూడిన పండగ వాతావరణాన్ని నింపాయి.

ప్రార్థనల అనంతరం ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "క్యాథెడ్రల్ చర్చ్‌లో జరిగిన క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఏసుక్రీస్తు బోధనలు మన సమాజంలో ప్రేమ, శాంతి, సోదరభావాన్ని పెంపొందించాలని కోరుకుంటున్నాను" అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ పాల్ స్వరూప్ ప్రధాని ఆరోగ్యం, దేశ సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గత కొన్ని ఏళ్లుగా ప్రధాని మోదీ నిరంతరాయంగా క్రైస్తవ సంఘం నిర్వహిస్తున్న ఈస్టర్, క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటూ సామాజిక సామరస్యం పట్ల తన నిబద్ధతను చాటుకుంటున్నారు.

Related News : క్రిస్మస్ శుభాకాంక్షల్లోనూ ప్రత్యర్థులపై ట్రంప్ విమర్శల బాణం

నూటొక్కెళ్ళ అద్భుతం దేవాలయం.. మెదక్ చర్చ్

Next Story