- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నూటొక్కెళ్ళ అద్భుతం దేవాలయం.. మెదక్ చర్చ్
నూటొక్క ఏళ్ళు పూర్తి చేసుకొని అద్భుత నిర్మాణం గా ఆసియాలోనే కీర్తిని గడుస్తున్న మెదక్ చర్చి క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది.

దిశ, మెదక్ ప్రతినిధి : నూటొక్క ఏళ్ళు పూర్తి చేసుకొని అద్భుత నిర్మాణం గా ఆసియాలోనే కీర్తిని గడుస్తున్న మెదక్ చర్చి క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్దదిగా పేరొందిన కరుణామయుడు భక్తుల కోవెలగా నిలుస్తోంది. మానవత్వానికి.. మతసామరస్యానికి ప్రత్యేకగా నిలిచి మహోన్నత నిర్మాణం ఈ చర్చి.వందేళ్ల క్రితం అరుణార్తుల ఆకలి తీర్చేందుకు అంకురార్పణ జరిగిన అద్భుత నిర్మాణం చారిత్రాత్మక పర్యాటక కేంద్రంగా నిలుస్తోంది.అందుకే మతానికి కాకుండా ఈ చర్చి పర్యాటకంగా ప్రజల మనస్సుల్లో నిలుస్తోంది. ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన చర్చి లో క్రిస్మస్ ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు.
1979 సంవత్సరంలో ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వెస్లీయన్ మెథడిస్ట్ వారు మెదక్ ప్రాంతంలో కార్యకలాపాలు ప్రారంభించారు. అప్పట్లో మత ప్రబోధకుడైన చార్లెస్ వాకర్ పాస్నెట్ మెదక్ పట్టణంలోని ఓ చిన్న చర్చిలో మత గురువుగా నియమితులయ్యారు. క్రీస్తు అంటే ఎంతో భక్తి విశ్వాసాలు ఉన్న ఆయన మెదక్ ప్రాంతంలో మత ప్రచారంతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుత మిషన్ కాంపౌండ్ లోని చిన్న చర్చి సమీపంలో నిర్మించిన రెండంతస్తుల భవనంలో నే నివసించేవాడు. రోజు మాదిరిగా నే ఓ సాయంత్రం భవనం పైకి ఎక్కి పై అంతస్తు పై భాగంలో నుంచి చర్చిని గమనించాడు. చర్చి కన్నా తాను నివసించే భవనం ఎత్తుగా ఉండడం సరికాదని భావించాడు. తప్పును సరిద్దికునే మార్గం గురించి తీవ్రంగా ఆలోచించాడు. ఈ క్రమంలో ఆలోచన మెదిలింది. తన నివాస భవనం కన్నా చాలా పెద్దదైన చర్చిని నిర్మించడం ద్వారా పాప పరిహారం చేసుకోవాలని నిర్ణయించాడు.ఇంగ్లాండ్ లోని స్నేహితులకు తన ఆలోచన చెప్పాడు. వారు తమ వంతు సహకారం అందించేందుకు భరోసా ఇచ్చారు.అదే సమయంలో నాటి హైదరాబాద్ రాష్ట్రంలో భయంకరమైన కరువు ఏర్పడింది. మెతుకు సీమలో దుర్భిక్షం నెలకొంది. పంటలు పండే పరిస్థితి లేక పనులు దొరక్క ప్రజలకు ఉపాధి కరువైంది. వేలాదిమంది ఆకలి దప్పులతో అల్లాడారు.
ఈ నేపథ్యంలోనే చార్లెస్ వాకర్ పాస్నెట్ పనికి ఆహారం తరహాలో చర్చి నిర్మాణం పనులు చేపట్టారు. తద్వారా ప్రజలకు పని ఉపాధి చూపి ఆదుకున్నారు. ఈ విషయం తెలిసిన మెదక్ ప్రాంతవాసులే కాక పొరుగు జిల్లాల నుంచి సైతం ప్రజలు మెదక్ పని కోసం బాట పట్టారు. మెదక్ లో 19 14 లో చర్చి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వేలాది కూలీలు పని చేయడం తో దాదాపు పదేళ్ల పాటు నిర్మాణం పనులు సాగాయి. అద్భుత రీతిలో చర్చి నిర్మాణం 1924లో పూర్తయ్యాయి.
చర్చి నిర్మాణంలో ప్రత్యేకతలు..
చర్చి నిర్మాణంలో పలు చారిత్రక అద్భుత కట్టడాలు ఉన్నాయి. చర్చి లోపల 40 స్తంభాలు ఉన్నాయి. పైకప్పు ఎక్కడ చూసినా సిలువ ఆకారంలో ఉండడం ప్రత్యేకత. అలాగే చర్చి లోపలికి వెళ్తుంటే పది మెట్లు తర్వాత చుట్టూరా 66 చొప్పున ఎడమ కుడి వైపు విద్యుత్ సొబగులు సమకూరేల తామర పూలతో నిర్మించిన దిమ్మెలు గొలుసులతో కలపబడి ఉంటాయి. బైబిల్ లోని 66 గ్రంథాలకు సూచికగా 66 దిమ్మేలు ప్రతిగగా నిలుస్తున్నాయి.. ఏసుప్రభుకు ప్రధానంగా 12 మంది శిష్యులు ప్రపంచవ్యాప్తంగా సువార్తను పరిచయం చేయాలని ప్రభువు వారికి బోధన చేశారు. ఆయన 12 మంది శిష్యులకు గుర్తుగా 12 మెట్లు చర్చిలో నిర్మించారు.
చర్చి మొత్తం మూడు గాజు కిటికీలు ఉన్నాయి. వీటిని ఇంగ్లాండ్ కు చెందిన ఫ్రాంక్ ఓ సాలిజ్బారి రూపొందించారు. చర్చి లోపల ఆరాధించే స్థలంలో ఒకటి చొప్పున ఉత్తరం, తూర్పు, పడమర వైపు నిర్మించారు. ఈ కిటికీలపై సూర్యకిరణాలు పడితేనే అపురూప దృశ్యాలు కనబడతాయి. సూర్యుడు తూర్పున ఉదయించి పడమరన అస్తమిస్తాడు. ఉత్తరం వైపు కిరణాలు పడే అవకాశం లేకున్నా ఈ కిటికీని సూర్యకిరణాలు దరిచేరడం విశేషం. తూర్పు పడమరనపడే కాంతిపుంజలు కింద వేసిన బండలపై వక్రీభవనం చెంది ఉత్తరం వైపునకు ప్రసరిస్తాయి. ఈ మూడు కిటికీలకు స్థలాన్ని వదిలి వేరువేరు సంవత్సరాల్లో అమర్చినట్లు చెబుతుంటారు.
తూర్పు కిటికీ యేసు జన్మ వృత్తాంతం..
ఏసు పుట్టుకను తెలియజేలా ఈ కిటికీ ని 1947లో అమర్చారు. సూర్యకిరణాలు పడితేనే ప్రకాశవంతమైన చిత్రాలు దర్శనమిస్తాయి.కింది భాగంలో యేసు ప్రభువు తల్లి మరియా, తండ్రి యేసేపు, తొట్టెలో బాల యేసు ఎడమవైపు గొల్లలు మధ్యలో గాబ్రియల్ లోక రక్షకులు కుడివైపు జ్ఞానులు ఉంటారు. పై భాగంలో యేసుకి ఇష్టమైన పిల్లలు, మధ్యలో పెద్దమనిషి చిత్రాలు కనిపిస్తాయి. ఏసు పుట్టుకకు 700 ఏళ్లకు క్రితమే ఏసుప్రభు పుడతాడని యేష యా అనే ప్రవక్త తాను రాసిన గ్రంథంలో చెప్పారు. ఆయన గుర్తుగా ఈ కిటికీలో పెద్దమనిషి నీ పెట్టినట్లు ప్రతితీ.
యేసు సిలువ వృత్తాంతం పడమర కిటికీలో..
ఏను సిలువ సందర్భాన్ని తెలియజేసి ఈ కిటికీని 1958లో అమర్చారు.శిలువ ఎత్తుకున్న తర్వాత కింద కూర్చొని ఉన్న తల్లి మరియా, మీద చెయ్యి పట్టుకొని నిలబడి మరిమ్మ దృశ్యాలు కనిపిస్తాయి. ఎడమవైపు స్త్రీలతో పాటు ఏసు శిష్యుడు యేహన్ నిలబడి ఉంటాడు. ఏసు తన శిష్యుడు యోహాన్ కు ఏడు మాటలు చెబుతున్న తీరును ఈ దృశ్యాలు కళ్ళ కడతాయి. కుడివైపు బల్లెం పట్టుకొని ఉన్న శతాధిపతి కూడా కనిపిస్తాడు. దీనిపై హిందీ, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో వాక్యాలు ఉన్నాయి.
చర్చి నిర్మాణంలో నైపుణ్యం కలిగిన ఇంజనీర్ ల ప్రతిభ..
మహా చర్చి నిర్మాణంలో దేశ విదేశాలకు చెందిన ఇంజనీర్ ల అద్భుత ప్రతిభ నైపుణ్యం ఉంది. 1914 లో చర్చి నిర్మాణం ప్రారంభించగా ఇటలీ తో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన నిర్మాణ రంగ నిపుణులు ఉన్నాను. చర్చి నమూనాను ఐరోపా గోధిక్ శైలి లో బ్రిటిష్ ఇంజనీర్ బ్రాద్ షా రూపొందించగా థామస్ ఏడ్వార్డ్ వాస్తు శిల్పిగా పని చేశారు. దంగు సున్నం, రాళ్ళ తో 200 అడుగుల పొడగు, 100 అడుగుల వెడల్పుతో రెండు అంతస్తులు నిర్మించిన ఈ చర్చి ప్రార్థనాలయానికి 175 అడుగుల ఎత్తులో గోపురం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. చర్చిలో ఒకే సారి 5000 వేల మంది ప్రార్థన చేసుకోవచ్చు. చర్చిలో ధ్వని రాకుండా రబ్బరు, పత్తిని వినియోగించి పైకప్పు వేశారు. ప్రధాన ద్వారానికి స్వాగత తోరణం హైదారాబాద్ కు చెందిన కంపెనీ నిర్మించారు. 1924 లో ఏసు క్రీస్తు జననం 25 న క్రిస్మస్ రోజే ప్రారంభించారు.
బిషప్ ల పర్యవేక్షణలో సేవలు...
మెదక్ కేథడ్రల్ చర్చి కు ఇప్పటి వరకు 8 మంది బిషప్ లు సేవలు అందించారు. చర్చి ఆఫ్ ఇండియా పరిధిలో 24 డయాసిస్ లు ఉన్నాయి. వీటిలో మెదక్ దయాసీస్ ఒకటి. 1947 సెప్టెంబర్ 30 న ఆవిర్భవించింది. దీని పరిధిలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, హైదరాబాద్, అదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలు వస్తాయి. క్రైస్తవ సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించి బిషప్ ను ఎన్నుకుంటారు. పదవీ కాలం 67 ఏళ్ళ వయసు వరకు పదవీలో కొనసాగుతారు. చర్చి ఆధ్వర్యంలో ఉన్న వైద్య శాలలు, విద్యా సంస్థలు, శిశు సంరక్షణ కేంద్రాలు, వృద్ధుల ఆశ్రమాలను పర్యవేక్షిస్తారు. సామాజిక సేవ కార్యక్రమాలు, పండగ సందర్భంగా దైవ సందేశాన్ని అందిస్తారు.
బారీ స్థాయిలో ఉత్సవాలకు ఏర్పాట్లు
మెదక్ లోని ప్రఖ్యాత కేథడ్రాల్ చర్చి లో క్రిస్మస్ ఉత్సవాలు బారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. చర్చిని రంగు రంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న భక్తులు భారీ సంఖ్యలో ఇచ్చే అవకాశం ఉండడం తో అందుకు అనుగుణంగా చర్చి ఆవరణలో అధికార యంత్రాంగం తో పాటు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా భారీ కేడ్లు ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నారు. చర్చికి వచ్చే భక్తులలో పాటు వీ ఐ పి లు వస్తె ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ యంత్రాంగం పర్యవేక్షిస్తుంది.
భారీ స్థాయిలో బందోబస్తు -జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస రావు
క్రిస్మస్ వేడుకల సందర్భంగా మెదక్ లోని ప్రసిద్ధ మెదక్ చర్చ్ ను భారీ సంఖ్యలో భక్తులు సందర్శించనున్న నేపథ్యంలో శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీస్ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. పోలీస్ సిబ్బందిని 4 సెక్టార్‌లుగా, మూడు షిఫ్ట్‌లుగా విభజించి, నిరంతర పర్యవేక్షణలో మొత్తం 496 మంది అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు విధులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇందులో డీఎస్పీలు 4, సీఐలు 12, ఎస్ఐ లు 47, ఏ ఎస్ఐ లు 31, హెడ్ కానిస్టేబుళ్లు 46, పోలీస్ కానిస్టేబుళ్లు 185, హోంగార్డులు 87, 3 క్యూ ఆర్టీ బృందాలు 51 మంది, 3 రోప్ పార్టీలు 33 మంది ఉన్నట్లు తెలిపారు. ఈ బందోబస్తును కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీ కెమెరాల సహాయంతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.
Read More..






