- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రిస్మస్ శుభాకాంక్షల్లోనూ ప్రత్యర్థులపై ట్రంప్ విమర్శల బాణం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిస్మస్ పర్వదినం సందర్భం కూడా రాజకీయ విమర్శలు చేశారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూనే తన రాజకీయ ప్రత్యర్థులపై ట్రంప్ విరుచుకుపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) క్రిస్మస్ పర్వదినం సందర్భం కూడా రాజకీయ విమర్శలు చేశారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూనే తన రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలతో ట్రంప్ విరుచుకుపడ్డారు. దేశాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్న "రాడికల్ లెఫ్ట్" శక్తులకు కూడా శుభాకాంక్షలు అంటూ ఎద్దేవా చేసిన ఆయన, వారు చేస్తున్న ప్రయత్నాలన్నీ ఘోరంగా విఫలమవుతున్నాయని పేర్కొన్నారు. తన పాలనలో అమెరికా సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయని, మహిళా క్రీడల్లో పురుషులు (ట్రాన్స్‌జెండర్లు) పాల్గొనకుండా కఠిన చర్యలు తీసుకున్నామని, అలాగే చట్టాల అమలును మరింత పటిష్టం చేశామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఆర్థిక రంగంలో అమెరికా సాధిస్తున్న విజయాలను హైలైట్ చేస్తూ, దేశంలో రికార్డు స్థాయిలో స్టాక్ మార్కెట్ వృద్ధి చెందిందని, దశాబ్ద కాలంలోనే అత్యంత తక్కువ నేరాల రేటు నమోదవుతోందని ట్రంప్ వివరించారు. ద్రవ్యోల్బణం పూర్తిగా అదుపులో ఉందని, అంచనాల కంటే రెట్టింపు స్థాయిలో అంటే 4.3 శాతం GDP వృద్ధిని సాధించామని ఆయన గర్వంగా ప్రకటించారు. తాము విధించిన సుంకాల (Tariffs) వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ట్రిలియన్ల డాలర్ల ఆదాయం చేకూరిందని, ప్రస్తుతం అమెరికా జాతీయ భద్రతా అత్యంత బలంగా ఉందని, ప్రపంచ దేశాల ముందు అమెరికా గౌరవం మునుపెన్నడూ లేనంతగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు.
- Tags
- Trump






