అమెరికాకు భారత్‌ వరుస షాక్‌లు.. ట్రంప్‌కు మంట మండేలా మరో కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-08 13:25:29  IST  )

అమెరికా(America)తో వివాదం నెలకొన్న వేళ ప్రధాని నరేంద్ర(PM Modi) మోడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేశారు.

అమెరికాకు భారత్‌ వరుస షాక్‌లు.. ట్రంప్‌కు మంట మండేలా మరో కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా(America)తో వివాదం నెలకొన్న వేళ ప్రధాని నరేంద్ర(PM Modi) మోడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేశారు. 23వ రష్యా - భారత్ వార్షిక సదస్సుకు రావాలని పుతిన్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌తో యుద్ధంపై తాజా పరిణామాలను మోడీకి పుతిన్ వివరించారు. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పుతిన్‌కు మోడీ సూచించారు. భారత్ శాంతివైపు ఉందన్న స్థిర వైఖరిని ఈ సందర్భంగా మోడీ పునరుద్ఘాటించారు. ఇదిలా ఉంటే.. భారత్‌పై అమెరికా విధించిన టారిఫ్‌లకు ప్రతిస్పందనగా కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అమెరికా నుంచి ఆయుధాల కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయించారు. అంతేకాదు.. ఇప్పటికే ఫిక్స్ అయినా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికా పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఇండియాకు ఆహ్వానించారు. దీనిపై ట్రంప్ ఎలా స్పందిస్తారో అని ఆసక్తి నెలకొంది.

అమెరికా షాక్ ఇచ్చిన భారత్.. 3.6 బిలియన్ డాలర్ల ఒప్పందం నిలిపివేత

Union Cabinet: అమెరికా తిక్క కుదిరేలా కీలక నిర్ణయం

Next Story