Union Cabinet: అమెరికా తిక్క కుదిరేలా కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-08 11:07:04  IST  )

ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్(Union Cabinet) సమావేశం అయింది.

Union Cabinet: అమెరికా తిక్క కుదిరేలా కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్(Union Cabinet) సమావేశం అయింది. ఈ సమావేశంలో దేశ ఆర్థిక విధానాలు, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై విధించిన 50% టారిఫ్‌లపై చర్చ జరిగింది. ఈ టారిఫ్‌లలో 25 శాతం టారిఫ్‌లు ఆగస్టు 7 నుంచి అమలులోకి వచ్చాయి. మిగతా 25 శాతం టారిఫ్‌లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి ఆయుధాల కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయించింది. అంతేకాదు.. ఇప్పటికే ఫిక్స్ అయిన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అమెరికా పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు.

ట్రంప్ విధించిన టారిఫ్‌లు భారతదేశ ఎగుమతులపై, ముఖ్యంగా ఔషధాలు, రసాయనాలు, రాగి, ఇతర రంగాలలో గణనీయమైన ప్రభావం చూపనున్నాయని.. అందుకే.. కౌంటర్ నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని కేబినెట్ అభిప్రాయపడినట్లు సమాచారం.

Next Story