విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం.. బ్లాక్‌ బాక్స్‌పై ఎయిరిండియా కీలక ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-13 08:30:34  IST  )

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఇన్వెస్టిగేషన్ టీమ్ అత్యంత కీలకమని భావిస్తున్న బ్లాక్‌ బాక్స్‌పై ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది.

విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం.. బ్లాక్‌ బాక్స్‌పై ఎయిరిండియా కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఇన్వెస్టిగేషన్ టీమ్ అత్యంత కీలకమని భావిస్తున్న బ్లాక్‌ బాక్స్‌పై ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. క్రాష్ అయిన బోయింగ్‌ 787-8 డ్రీమ్‌ లైనర్‌ ఫ్లైట్ బ్లాక్ బాక్స్ తమకు ఇంకా లభించలేదని స్పష్టం చేసింది. గుజరాత్ ఏటీఎస్ అధికారులు ప్రస్తుతం అదే పనిలో ఉన్నారని ఎయిరిండియా అధికారులు పేర్కొన్నారు. ఒకవేళ ఆ బ్లాక్ బాక్స్‌ దొరికితే కీలక విషయాలు వెలుగులోకి వచ్చే చాన్స్ ఉంది. సాధారణంగా ఫ్లైట్లు, హెలికాప్టర్లు క్రాష్ అయితే.. వాటిలో ఉండే బ్లాక్ బాక్స్ (Black Box) విచారణకు అత్యంత కీలకం. విమానం టెయిల్ భాగంలో ఆ బాక్స్‌ను ఫిక్స్ చేస్తారు. ఎండ, వాన, అగ్ని ప్రమాదం జరిగినా.. ఆరెంజ్ కలర్‌లో ఉండే ఆ బ్లాక్ బాక్స్‌ చెక్కుచెదరకుండా ఉంటుంది. దాంతో అసలు విమాన ప్రమాదం ఎలా జరిగిందనేది స్పష్టంగా తెలుస్తోంది.

కాగా, ప్రపంచ వ్యాప్తంగా జరిగిన విమాన ప్రమాదాల్లోనూ ఇదే బ్లాక్ బాక్స్ స్పష్టమైన ఆధారాలను బయటపెట్టింది. ఇన్వెస్టిగేషన్ టీమ్‌ (Investigation Teams)లు కీలక ఆధారాల కోసం ఆ బాక్స్‌పైనే ఆధారపడుతుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి విమానం టేకాఫ్‌ అయిన సమయం నుంచి ల్యాండ్ అయ్యేంత వరకు కాక్‌పిట్‌లో పైలెట్లు మాట్లాడిన ప్రతి సంభాషణ స్పష్టంగా రికార్డ్ అవుతుంది. అసలు విమానం కూలే ముందు వాళ్లు ఏం మాట్లాడారు..? ఏటీసీకి ఏమని సమాచామిచ్చారనే విషయాలు వెలుగులోకి రానున్నాయి. అందుకే ఇప్పుడు అదే బ్లాక్ బాక్స్ అహ్మదాబాద్ ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ఫ్లైట్ ఘటనలో అత్యంత కీలక కానుంది.

Read More..

ఎయిరిండియా ఫ్లైట్ క్రాష్.. అందరిచూపు బ్లాక్ బాక్స్ వైపే

Ahmedabad plane crash: ఊహకందని పెను విషాదం: ప్రధాని మోడీ

Next Story