- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ahmedabad plane crash: ఊహకందని పెను విషాదం: ప్రధాని మోడీ
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన స్థలాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ఉదయం పరిశీలించారు.

దిశ, నేషనల్ బ్యూరో: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన స్థలాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ఉదయం పరిశీలించారు. గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్ లోని గాట్విక్ ఎయిర్ పోర్టుకు బయలుదేరిన కొన్ని సెకన్లలోనే ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 265 మంది చనిపోయారు. ఈ ప్రమాదం పై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడి పరిస్థితి, ప్రమాద వివరాలను ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు.
విమాన ప్రమాద బాధితులకు పరామర్శ
విమాన ప్రమాద ఘటన స్థలం పరిశీలన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకుని అక్కడ ప్రమాద బాధితులను పరామర్శించారు. ముఖ్యంగా ఈ ప్రమాదంలో మృత్యుంజయుడు రమేశ్ విశ్వాస్ కుమార్ ను ప్రధాని ప్రత్యేకంగా పరామర్శించారు. ఆయన వద్దకు వెళ్లి ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. విమానం మెడికల్ కాలేజీపై కూలగా అందులోని 20 మంది పైగా వైద్య విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన ఇతర మెడికోలనూ మోదీ హాస్పిటల్ లో పరామర్శించారు. కాగా ప్రధాని వెంట కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఆ రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘవి ఉన్నారు.
మాటలకందని విషాదం : ప్రధాని మోడీ
ఈ ఘటన అనంతరం అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఘటన ఊహించని పెను విషాదమని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాల బాధ భరించరానిదని అన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులను కోల్పోయిన వారి బాధను తాను అర్థం చేసుకోగలనని మోడీ అన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఎయిరిండియా ఎండీ, సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ కూడా పరిశీలించారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. బ్రిటిష్ హైకమిషన్ అధికారులు నేడు అహ్మదాబాద్‌కు చేరుకోనున్నారు. ఘటన స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతదేహాల కోసం శిథిలాల కింద జాగిలాలతో గాలిస్తున్నారు.
మొత్తం 265 మంది మృతి
ఈ విమాన ప్రమాదంలో మొత్తం ఇప్పటి వరకు 265 మంది చనిపోగా.. చాలా మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విమానంలో మొత్తం క్రూ తో కలిపి 241 మంది చనిపోయారు. రమేశ్ విశ్వాస్ కుమార్ అనే 11ఏ సీటు పొందిన వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా మృతి చెందారు. విమానం బీజై మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలడంతో లంచ్ చేస్తున్న విద్యార్థులు 20 మందికి పైగా చనిపోయారు. ఈ ప్రమాదంలో మొత్తం 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిషర్లు, మిగతా వివిధ దేశాలకు చెందిన వారు ఉన్నారు. ప్రాణాలతో బయటపడ్డ రమేశ్ విశ్వాస్ కుమార్ తాను విమానంలో నుంచి దూకలేదని విమానం కూలిన సమయంలో బ్లాస్టింగ్ దాటికి తన సీటు ఎగిరి పక్కకు వెళ్లిపోయిందని.. శిథిలాల కింద చిక్కుకోవడంతో వేడి మంటల నుంచి తప్పించుకోగలిగినట్లు వైద్యులతో తెలిపాడు.
సహాయక చర్యలకు సహకరిస్తాం.. రిలయన్స్
విమాన ప్రమాద ఘటనలో కొనసాగుతున్న సహాయక చర్యలకు సాయం చేయడానికి తమ సంస్థ సిద్ధంగా ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఎయిర్ ఇండియా ఇప్పటికే ప్రమాదంలో మృతి చెందిన ఒక్కొక్కరికి రూ. కోటి నష్టపరిహారం అందజేయనున్నట్లు ప్రకటించింది.
పైలెట్ పాత వీడియో వైరల్
విమాన పైలైట్ కెప్టెన్ సుమిత్ (Sumeet Sabharwal) తన తండ్రితో గతంలో మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైలెట్ జాబ్ మానేసి నిన్ను బాగా చూసుకుంటాను నాన్న అంటూ ఈ వీడియోలో ఉండటం కన్నీళ్లు తెప్పిస్తోంది. సుమిత్ కు 8200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉండటం గమనార్హం. సుమిత్ నాన్న కూడా గతంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)లో విధులు నిర్వర్తించడం విశేషం.
Read More..






