- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎయిరిండియా ఫ్లైట్ క్రాష్.. అందరిచూపు బ్లాక్ బాక్స్ వైపే
అహ్మదాబాద్ (Ahmadabad)లో ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ఫ్లైట్ క్రాష్ అయిన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB) సంయుక్తంగా దర్యాప్తు చేపడుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్ (Ahmadabad)లో ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ఫ్లైట్ క్రాష్ అయిన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB) సంయుక్తంగా దర్యాప్తు చేపడుతున్నాయి. టేకాఫ్ సమయంలో ఇంజిన్లు ఫెయిల్ అవ్వడంపై టెక్నికల్ టీమ్ (Technical Team)తో కలిసి ఆరా తీస్తున్నారు. ఫ్లైట్ గాల్లోకి లేచిన నిమిషం వ్యవధిలో కూలిపోవడం.. సాంకేతిక లోపాన్ని సిబ్బంది గమనించకపోవడంపైనే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన తీరుపై వారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రాథమిక నివేదకను సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ భారతకు బోయింగ్ కంపెనీ ప్రతినిధులతో పాటు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ బృందం, అదేవిధంగా బోయింగ్ ఇంజిన్ తయారీ సంస్థ జీఈ ఏరో స్పేస్ టీమ్ రానుంది. వారి సమక్షంలోనే ఇన్వెస్టిగేషన్ టీమ్ బ్లాక్ బాక్స్‌ను డీకోడ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది.
అత్యంత కీలకంగా మారిన బ్లాక్ బాక్స్
సాధారణంగా ఫ్లైట్లు, హెలికాప్టర్లు క్రాష్ అయితే.. వాటిలో ఉండే బ్లాక్ బాక్స్ (Black Box) విచారణకు అత్యంత కీలకంగా మారుతుంది. విమానం టెయిల్ భాగంలో ఆ బాక్స్‌ను ఫిక్స్ చేస్తారు. ఎండ, వాన, అగ్ని ప్రమాదం జరిగినా.. ఆరెంజ్ కలర్‌లో ఉండే ఆ బ్లాక్ బాక్స్ చెక్కుచెదరకుండా ఉంటుంది. దాంతో అసలు విమాన ప్రమాదం ఎలా జరిగిందనేది స్పష్టంగా తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన విమాన ప్రమాదాల్లోనూ ఇదే బ్లాక్ బాక్స్ స్పష్టమైన ఆధారాలను బయటపెట్టింది. ఇన్వెస్టిగేషన్ టీమ్ (Investigation Teams)లు కీలక ఆధారాల కోసం ఆ బాక్స్‌పైనే ఆధారపడుతుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి విమానం టేకాఫ్ అయిన సమయం నుంచి ల్యాండ్ అయ్యేంత వరకు కాక్‌పిట్‌లో పైలెట్లు మాట్లాడిన ప్రతి సంభాషణ స్పష్టంగా రికార్డ్ అవుతుంది. అసలు విమానం కూలే ముందు వాళ్లు ఏం మాట్లాడారు..? ఏటీసీకి ఏమని సమాచామిచ్చారనే విషయాలు వెలుగులోకి రానున్నాయి. అందుకే ఇప్పుడు అదే బ్లాక్ బాక్స్ అహ్మదాబాద్ ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ఫ్లైట్ ఘటనలో అత్యంత కీలక కానుంది.






