నేపాల్‌లో ఆందోళనలు తీవ్రం.. భారత్‌తో సరిహద్దు మూసివేత

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-06 08:42:58  IST  )

భారత సరిహద్దును ఆనుకుని ఉన్న నేపాల్ లోని కొన్ని ప్రాంతాల్లో మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగాయి. దీంతో అక్కడ హై సెక్యూరిటీ అలర్ట్ జారీ అయింది.

నేపాల్‌లో ఆందోళనలు తీవ్రం.. భారత్‌తో సరిహద్దు మూసివేత
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత సరిహద్దును ఆనుకుని ఉన్న నేపాల్ లోని కొన్ని ప్రాంతాల్లో మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగాయి. దీంతో అక్కడ హై సెక్యూరిటీ అలర్ట్ జారీ అయింది. మతపరమైన కంటెంట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నేపాల్ లోని పర్సా జిల్లాలోని బిర్గుంజ్ పట్టణంలో నిరసన మొదలయ్యాయి. ఇవి క్రమంగా హింసాత్మకంగా మారాయి. బిహార్ లోని రక్సౌల్ జిల్లా సరిహద్దుకు ఆనుకుని ఉన్న బిర్గుంజ్ నగరంలో పర్సా జిల్లా యంత్రాంగం కర్ఫ్యూ విధించింది.

మసీదు ధ్వంసం.. సరిహద్దు మూసివేత

నేపాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధనుషా జిల్లాలోని కమలా మునిసిపాలిటీలోని సఖువా మారన్ ప్రాంతంలో ఒక మసీదును కొంతమంది వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆందోళనలు, నిరసనలు మొదలయ్యాయి. ఇద్దరు ముస్లిం యువకులు సోషల్ మీడియాలో హిందూ వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ ను వ్యాప్తిచేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం బిర్గుంజ్ లో నిరసనకారులు టైర్లను తగలపెట్టారు. ఇది హింసాత్మకంగా మారడంతో.. పోలీసులు సిబ్బందిపై రాళ్లు రువ్వడం, స్థానిక పోలీస్ స్టేషన్ ను సైతం ధ్వంసం చేయడంతో పరిస్థితి అదుపుతప్పింది. దాంతో నిరసనకారులపై టియర్ గ్యాస్ షెల్స్ ను ప్రయోగించారు. ఈ నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో భారత్ నేపాల్ తో పంచుకుంటున్న సరిహద్దులను పూర్తిగా మూసివేసింది. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది.

Read More..

జపాన్ లో భారీ భూకంపం.. వైరల్ అవుతున్న భయానక వీడియోలు

బంగ్లాదేశ్‌లో ఆగని మారణహోమం.. ఒకే రోజు ఇద్దరు హిందువుల దారుణ హత్య

Next Story