జపాన్ లో భారీ భూకంపం.. వైరల్ అవుతున్న భయానక వీడియోలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-06 08:20:13  IST  )

జపాన్ లో మరో భారీ భూకంపం సంభవించింది. కొత్త సంవత్సరంలో వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైనట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.

జపాన్ లో భారీ భూకంపం.. వైరల్ అవుతున్న భయానక వీడియోలు
X

దిశ, వెబ్‌డెస్క్ : జపాన్ లో మరో భారీ భూకంపం సంభవించింది. కొత్త సంవత్సరంలో వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైనట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. మంగళవారం ఉదయం 10.18 గంటల సమయంలో చుగోకు రీజియన్లోని షిమనే ప్రిఫెక్చర్లో భూ ప్రకంపనలు వచ్చినట్లు ఏజెన్సీ వెల్లడించింది. జపాన్ లో పశ్చిమ నగరమైన యాసుగిలో భూకంప తీవ్రత 5 పాయింట్లు నమోదైనట్లు స్థానిక వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ సమయంలో జపాన్ చిగురుటాకులా వణికిపోయింది. షాపింగ్ మాల్స్, ఇళ్లలోని వస్తువులు కిందపడిపోగా.. సీలింగ్ ఫ్యాన్లు ఊగటాన్ని చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపటికి అదే ప్రాంతంలో 4.5, 5.1, 3.8, 5.4 తీవ్రతతో చిన్న చిన్న ప్రకంపనలు వచ్చాయని, ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని జపాన్ వాతావరణ సంస్థ (Japan Meteorological Agency) తెలిపింది. ఇంత భారీ భూకంపం వచ్చినా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. సుమారు 125 మిలియన్ల జనాభా నివసించే జపాన్ లో ప్రతీ ఏడాది దాదాపుగా 1500 భూకంపాలు నమోదవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

తాజాగా సంభవించిన భూకంపానికి సంబంధించి కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో మెట్రో రైల్వే స్టేషన్, చుట్టుపక్కల భవనాలు కదలడం స్పష్టంగా కనిపిస్తోంది. భూకంప కేంద్రం భూమిలోపల సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భారీ భూకంపం నేపథ్యంలో ఆఫ్టర్ షాక్స్ వచ్చే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Read More..

బంగ్లాదేశ్‌లో ఆగని మారణహోమం.. ఒకే రోజు ఇద్దరు హిందువుల దారుణ హత్య


Next Story