- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగ్లాదేశ్‌లో ఆగని మారణహోమం.. ఒకే రోజు ఇద్దరు హిందువుల దారుణ హత్య
బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులు, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నార్సింగ్‌డి జిల్లా, పలాష్ ఉపజిల్లాలో సోమవారం రాత్రి శరత్ చక్రవర్తి మణి (40) అనే హిందువును గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు.

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులు, హత్యలు (Attacks and murders on Hindus) కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నార్సింగ్‌డి జిల్లా, పలాష్ ఉపజిల్లాలో సోమవారం రాత్రి శరత్ చక్రవర్తి మణి (40) అనే హిందువును గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. చార్సిందూర్ బజార్‌లో తన కిరాణా దుకాణం నడుపుతుండగా దుండగులు ఆకస్మికంగా వచ్చి పదునైన ఆయుధాలతో దాడి చేశారని స్థానికులు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. తన జన్మభూమి "మరణ లోయ"గా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ డిసెంబర్ 19న మణి ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టడం గమనార్హం. ఇది జరిగిన రోజే, జెస్సోర్ ప్రాంతంలో రాణా ప్రతాప్ బైరాగి అనే ఐస్ ఫ్యాక్టరీ యజమానిని కూడా దుండగులు కాల్చి చంపారు.
గత 18 రోజుల్లో బంగ్లాదేశ్‌లో హిందువుల హత్య జరగడం ఇది ఆరోసారి కావడం అక్కడి మైనారిటీలలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు పెరిగాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా నూతన సంవత్సరం రోజున ఖోకోన్ దాస్ అనే వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన ఘటన మరువక ముందే ఈ తాజా హత్యలు చోటుచేసుకున్నాయి. జెస్సోర్‌లో జరిగిన ఘటనలో రాణా ప్రతాప్ బైరాగిని ముగ్గురు దుండగులు మోటార్ సైకిల్‌పై వచ్చి, ఫ్యాక్టరీ నుంచి బయటకు పిలిచి తలపై కాల్చి చంపారని స్థానిక మీడియా 'ప్రోథమ్ అలో' వెల్లడించింది. ఈ హత్యల వెనుక గల కారణాలు ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. వరుస హత్యలు, దాడులతో అక్కడి హిందువుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
Read More..
మెట్రో క్వార్టర్స్‌లో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి






