- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ పేలుడు కుట్రదారులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం: ప్రధాని మోడీ
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు జరిగి 12 మంది మృతి చెందగా మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు (Massive explosion at Red Fort) జరిగి 12 మంది మృతి చెందగా మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ షాకింగ్ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. అయితే పేలుడును ఆత్మాహుతి దాడిగా అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషాద ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) తీవ్ర స్థాయిలో స్పందించారు.
ప్రస్తుతం భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ థింపూ సమావేశంలో మాట్లాడుతూ.. ఢిల్లీ పెలుడు కుట్రకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని, కుట్ర వెనుక ఉన్నవారిని కూడా వదిలే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో స్పందించారు. "ఈ రోజు నేను చాలా బరువెక్కిన హృదయంతో ఇక్కడికి వచ్చాను. నిన్న సాయంత్రం ఢిల్లీలో జరిగిన దారుణ సంఘటన అందరినీ తీవ్ర బాధకు గురిచేసింది. బాధిత కుటుంబాల బాధను నేను అర్థం చేసుకున్నాను. ఈ రోజు మొత్తం దేశం వారితో నిలుస్తుంది. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్న అన్ని సంస్థలతో నేను నిన్న రాత్రంతా సంప్రదిస్తున్నాను. మా ఏజెన్సీలు ఈ కుట్రను లోతుగా పరిశీలిస్తాయి. దీని వెనుక ఉన్న కుట్రదారులను వదిలిపెట్టబోము" త్వరలోనే నిందితులు బయటపడతారని ఈ సందర్భంగా ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే రేపు సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశానికి షెడ్యూల్ ఖరారు అయింది. ఇందులో ఢిల్లీ పేలుడు ఘటన పై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read More... ఢిల్లీ బ్లాస్ట్.. అమిత్ షా హైలెవల్ మీటింగ్






