- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ పేలుడుపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సీజేఐ గవాయ్
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు (Huge explosion) సంభవించి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం పట్ల భారత ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్ (Chief Justice B.R. Gavai) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదుల తరఫున సంతాపం ప్రకటిస్తూ సీజేఐ గవాయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో.. “ఈ వినాశకరమైన విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాము. ఈ దుఃఖ సమయంలో దేశం మొత్తం ఒకటిగా నిలిచి బాధిత కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాము." సుప్రీంకోర్టు సమాజం మొత్తంగా ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, బాధితులకు న్యాయం జరిగేలా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.
Read More... ఢిల్లీలో పేలుళ్లతో దేశవ్యాప్తంగా హై అలర్ట్






