ఢిల్లీ బ్లాస్ట్.. అమిత్‌ షా హైలెవల్‌ మీటింగ్‌

by Prasad Jukanti |   (  Updated:2025-11-11 06:15:04  IST  )

ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా హై లెవల్ మీటింగ్ నిర్వహించారు.

ఢిల్లీ బ్లాస్ట్.. అమిత్‌ షా హైలెవల్‌ మీటింగ్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో నిన్న సాయంత్రం జరిగిన భారీ పేలుడు (Delhi blast) తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ఉన్నతస్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు. మంగళవారం ఉదయం అమిత్ షా నివాసంలో జరుగుతున్న ఈ హై సెక్యూరిటీ రివ్యూ (High-level security meeting) మీటింగ్‍కు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. జమ్ముకశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నళిన్ ప్రభాత్ వర్చువల్‍గా హాజరయ్యారు. జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం, ఢిల్లీలో పేలుడు ఘటనపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ పేలుడు వెనుక కారణాలేమిటి? అనే విషయాలను అమిత్‍షా అధికారులను అరా తీస్తున్నారు. ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా ఉన్న తాజా పరిస్థితిపై అధికారులను అమిత్ షా అడిగి తెలుసుకుంటున్నారు.

Read More... ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఎఫెక్ట్.. ఎర్రకోట మెట్రో స్టేషన్‌ షట్‌డౌన్

Next Story