ఎర్రకోట వద్ద పేలుడు ఘటన.. 12కు చేరిన మృతుల సంఖ్య

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-11 06:43:20  IST  )

రాజధాని ఢిల్లీ (Delhi)లోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఘటన దేశ ప్రజలకు శోకసంద్రంలోకి నెట్టేసింది.

ఎర్రకోట వద్ద పేలుడు ఘటన.. 12కు చేరిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: రాజధాని ఢిల్లీ (Delhi)లోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఘటన దేశ ప్రజలను శోకసంద్రంలోకి నెట్టేసింది. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోగా.. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అప్రమత్తమైన స్థానికులు భద్రతా సిబ్బందికి సమాచారం అందజేయగా.. వారు స్పాట్‌కు చేరుకుని కాలిన గాయాలతో అల్లాడుతున్న క్షతగాత్రులను సమీపంలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ హాస్పిటల్‌ (Loknayak Jayaprakash Hospital)కు చికిత్స నిమిత్తం తరలించారు. అయితే, ఇవాళ ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లుగా కాసేపటి క్రితం ఢిల్లీ పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

Next Story