భారత్‌ ట్యాక్సీ యాప్‌ను ప్రారంభించనున్న కేంద్రం

by Malleboina Mahesh |   (  Updated:2025-12-17 07:12:05  IST  )

ప్రముఖ ప్రైవేట్ క్యాబ్ సేవల సంస్థలైన ఓలా (Ola), ఉబెర్ (Uber)లకు ధీటుగా కేంద్ర ప్రభుత్వం జనవరి 1 నుంచి తన సొంత క్యాబ్ సర్వీస్ యాప్ 'భారత్ ట్యాక్సీ ని ప్రారంభించనుంది.

భారత్‌ ట్యాక్సీ యాప్‌ను ప్రారంభించనున్న కేంద్రం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ప్రైవేట్ క్యాబ్ సేవల సంస్థలైన ఓలా (Ola), ఉబెర్ (Uber)లకు ధీటుగా కేంద్ర ప్రభుత్వం జనవరి 1 నుంచి తన సొంత క్యాబ్ సర్వీస్ యాప్ 'భారత్ ట్యాక్సీ ని ప్రారంభించనుంది. ప్రస్తుతం ప్రైవేట్ క్యాబ్ సంస్థలు వసూలు చేస్తున్న అధిక ఛార్జీలు, క్యాన్సిలేషన్ సమస్యలు, సర్జ్ ప్రైసింగ్ (రద్దీ సమయంలో ఎక్కువ ధర) నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించడమే ఈ యాప్ ప్రధాన ఉద్దేశ్యం. ప్రభుత్వ పర్యవేక్షణ లో నడిచే ఈ యాప్ ద్వారా ప్రయాణికులకు తక్కువ ధరకే సురక్షితమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది.

56 వేల మంది డ్రైవర్ల రిజిస్ట్రేషన్

ఈ ప్రాజెక్టు పై కేంద్రం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఇప్పటివరకు సుమారు 56 వేల మంది డ్రైవర్లు భారత్ ట్యాక్సీ యాప్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రైవేట్ క్యాబ్ యాప్స్‌తో పోలిస్తే డ్రైవర్ల నుంచి వసూలు చేసే కమిషన్ తక్కువగా ఉండటం వల్ల, డ్రైవర్లకు ఎక్కువ ఆదాయం లభించడంతో పాటు ప్రయాణికులకు కూడా తక్కువ చార్జీలకే సేవలు అందే అవకాశం ఉంది. ఈ కొత్త విధానం రవాణా రంగంలో పారదర్శకతను పెంచడమే కాకుండా, సామాన్య ప్రయాణికులకు ఆర్థికంగా భారీ ఊరటనిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే ముందస్తుగా రిజిస్టర్ అయిన డ్రైవర్లు అందుబాటులో ఉండటం తో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉంటాయి.

Read More... లోక్‌సభ ముందుకు 'అణుశక్తి నియంత్రణ బిల్లు

భార‌త ఆతిథ్యానికి మెస్సీ ఫిదా.. సోష‌ల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్

Next Story