లోక్‌సభలో మహిళలకు 272 సీట్లు.. కేంద్రం క్లారిటీ

by Prasad Jukanti |   (  Updated:2026-04-16 09:27:54  IST  )

మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి నష్టం జరగదని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభ స్థానాల సంఖ్య 815కి పెరుగుతుందని వెల్లడించింది.

లోక్‌సభలో మహిళలకు 272 సీట్లు.. కేంద్రం క్లారిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల (Women's Reservation) విషయంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ లోక్‍సభలో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్‌ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు వీలుగా కేంద్రం 3 కీలక బిల్లులను లోక్‌సభలో (Lok Sabha) ప్రవేశపెట్టింది. ఈ బిల్లులపై చర్చసందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‍వాల్ (Arjun Ram Meghwal) మాట్లాడుతూ.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లు వల్ల ఏ రాష్ట్రానికి గాని, పురుషులకు గానీ ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు. రాష్ట్రాలు లోక్‍సభ సీట్లు కోల్పోవన్నారు. ఈ బిల్లులతో లోక్‍సభ స్థానాల సంఖ్యను 815కు పెరిగితే, మహిళలకు లోక్‍సభలో 272 సీట్లు లభిస్తాయన్నారు.

సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు:

ఈ రోజు పార్లమెంట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అని మేఘ్‍వాల్ అన్నారు. 2023లోనే నారీశక్తి వందన్ అధినియం బిల్లును ఆమోదం పొందింది. మహిళళకు 33 శాతం రిజర్వేషన్లపై ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం లభించిందని ఇక మహిళా రిజజర్వేషన్లను అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. కొన్ని బిల్లులను భావితరాలు మరువలేదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 368(2) ప్రకారం ప్రజాహిత నిర్ణయాలు తీసుకోవచ్చని చెప్పారు. ఆర్టికల్ 368 ద్వారా ద్వారా ప్రజాహిత నిర్ణయాలకు పార్లమెంట్‍కు రాజ్యాంగం శక్తి ఇచ్చిందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మూడు బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ బిల్లు ద్వారా మహిళల ప్రాతినిథ్యం పెరుగుతుందన్నారు. మహిళలకు సామాజిక న్యాయం కోసం కేంద్రం అనేక పథకాలు తెచ్చిందని మహిళలకు శౌచాలయాలు, ఉజ్వల యోజన అమలు చేశామన్నారు. ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక న్యాయం జరగాల్సిందేనన్నారు. మహిళలకు జన్‍ధన్ ఖాతాలు, పీఎం ముద్రా యోజన, సుకన్య సమృద్ధి యోజన, లఖ్ పతీ దీదీ వంటి పథకాలు అమలు చేశామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు చేయూత నిచ్చాం. మహిళల రిజర్వషన్లకు సంబంధించి మూడేళ్ల క్రితం ఇవే చర్చలు జరిగాయి.

పాకిస్థాన్‌‌ను చేసినట్లు చేశారు: ఏపీ విభజనపై ఎంపీ తేజస్వీ సూర్య ఫైర్

డీలిమిటేషన్‌పై రేవంత్ ప్రతిపాదన ‘ఫూలిష్’.. తేజస్వీ సూర్య సంచలన వ్యాఖ్యలు

మహిళా బిల్లుపై గౌరవ్ గగోయ్ సంచలన వ్యాఖ్యలు.. డీలిమిటేషన్ లింక్‌పై అభ్యంతరం.

మహిళా బిల్లులో 'డీలిమిటేషన్' ట్విస్ట్: 850 సీట్లు.. 272 మంది మహిళా ఎంపీలు!

Next Story