పాకిస్థాన్‌‌ను చేసినట్లు చేశారు: ఏపీ విభజనపై ఎంపీ తేజస్వీ సూర్య ఫైర్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-16 10:46:18  IST  )

పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు..

పాకిస్థాన్‌‌ను చేసినట్లు చేశారు:  ఏపీ విభజనపై ఎంపీ తేజస్వీ సూర్య ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్‌(Parliament)లో మహిళా రిజర్వేషన్ల బిల్లు(Women Reservation Bill)పై జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య(BJP MP Tejaswi Surya) ఆంధ్రప్రదేశ్ విభజన(Andhra Pradesh Partition) అంశాన్ని ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ(Congress party) ఏపీ(Ap)ని విడదీసిన తీరు అత్యంత దారుణంగా ఉందని, గతంలో దేశం నుంచి పాకిస్థాన్‌ను ఏ విధంగానైతే అశాస్త్రీయంగా విడదీశారో, ఏపీ పునర్వ్యవస్థీకరణ(AP Reorganization)ను కూడా అదే రీతిలో చేపట్టారని ఆయన మండిపడ్డారు. ఈ విభజన ప్రక్రియలో కనీస ప్రమాణాలు పాటించలేదని ఆయన ధ్వజమెత్తారు. బ్రిటిష్ వారు అనుసరించిన విభజన రాజకీయాల కంటే కాంగ్రెస్ పార్టీ చేసిన ఏపీ విభజన మరీ దారుణంగా ఉందని తేజస్వీ సూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల మనోభావాలను, భవిష్యత్తును పరిగణనలోకి తీసుకోకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆనాడు హడావుడిగా రాష్ట్రాన్ని ముక్కలు చేశారని ఆయన విమర్శించారు. పార్లమెంట్ వేదికగా ఆయన చేసిన ఈ పోలిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.

తెలంగాణ ఏర్పాటును పాక్ విభజనతో పోల్చడమా?.. తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై నిరంజన్‌రెడ్డి ఫైర్

Next Story