పెళ్లిలో పన్నీరు పెట్టలేదని కర్రలతో దాడి.. పలువురికి గాయాలు (వీడియో)

by Hamsa |
పెళ్లిలో పన్నీరు పెట్టలేదని కర్రలతో దాడి.. పలువురికి గాయాలు (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: వివాహ వేడుకల్లో చిన్న చిన్న లోపాలను పట్టుకుని కొంత మంది గొడవలు పడుతుంటారు. అవి కాస్త పెరిగి ప్రాణాలు తీసేదాక వెళ్తుంది. ఇటీవల ముఖ్యంగా ఆహార పదార్థాల విషయంలోనే ఎక్కువ గొడవలు తలెత్తుతున్నాయి. తాజాగా, ఉత్తర ప్రదేశ్‌లోని ఓ పెళ్లి వేడుకలో పనీరు పెట్టలేదని కర్రలతో దాడి చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లో ఓ వివాహ వేడుకలో వధువు కుటుంబ సభ్యులు వరుడు కుటుంబ సభ్యులకు పన్నీరు వడ్డించలేదని వారు కోపంతో ఊగిపోయారు. వధువు కుటుంబీకులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పెళ్లి కూతురు బంధువులు వరుడు తరపు వారిని బ్రతిమిలాడారు. అయినా వారు శాంతించకపోవడంతో ఇరు కుటుంబాల మధ్య తోపులాట జరిగింది. అంతటితో ఆగకుండా ఇరువర్గాలు కర్రలతో, బెల్టులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గొడవను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Next Story

Most Viewed