గ్రాస్ రూట్ లీడర్.. కిషన్ రెడ్డికి ప్రధాని మోడీ స్పెషల్ బర్త్ డే విషెస్

by Rajesh |
గ్రాస్ రూట్ లీడర్.. కిషన్ రెడ్డికి ప్రధాని మోడీ స్పెషల్ బర్త్ డే విషెస్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి నేడు తన 60వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన ఆయన వరుసగా రెండో సారి కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. ఎన్డీయే ప్రభుత్వం ఆయనకు బొగ్గు మరియు గనుల శాఖను కేటాయించిన విషయం తెలిసిందే. కాగా, శనివారం ఆయన బర్త్ డే సందర్భంగా ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా స్పెషల్ విషెస్ తెలిపారు. ‘కిషన్ రెడ్డి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. కిషన్ రెడ్డి గ్రాస్ రూట్ లీడర్, అట్టడుగు స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా మంత్రిగా ఎదిగారు. ప్రజలకు సేవ చేయడంలో ఆయన చేస్తున్న కృషి మనందరికి ఆదర్శప్రాయమైనది. ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను.’ అని మోడీ ట్వీట్ చేశారు.Next Story

Most Viewed