ఆ హీరో చేసిన మోసం కారణంగా సింగిల్‌‌గా ఉండిపోయిన సీనియర్‌ హీరోయిన్‌ శోభన..?

by Kavitha |
ఆ హీరో చేసిన మోసం కారణంగా సింగిల్‌‌గా ఉండిపోయిన సీనియర్‌ హీరోయిన్‌ శోభన..?
X

దిశ, సినిమా: అలనాటి స్టార్ హీరోయిన్ శోభన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. దీంతో పాటు తన అద్భుతమైన నాట్యంతో ఆకట్టుకున్నారు. ఈమె తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళం వంటి భాషా చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా రాణించారు. అందరూ స్టార్ హీరోల సరసన 40 సినిమాలకు పైగా నటించారు శోభన. 1997 తర్వాత సినిమాలకు దూరం అయిన ఈమె దాదాపు 18 సంవత్సరాల తర్వాత ‘కల్కీ2898AD’ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఓ సీన్‌లో మెరిశారు. రెండు దశాబ్దాలకు మళ్లీ ఆమె తెలుగు ఆడియన్స్‌ని పలకరించబోతున్న నేపథ్యంలో ఈమెకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. శోభన ప్రస్తుత వయసు 54. కానీ ఇంత వయసు వచ్చినా ఆమె మ్యారేజ్‌ చేసుకోలేదు. దానికి కారణాలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

శోభన మలయాళి అమ్మాయి. అక్కడ క్లాసికల్‌ డాన్స్ కి ప్రయారిటీ ఇస్తారు. దీంతో చిన్నప్పట్నుంచే డ్యాన్స్ నేర్చుకుంది. నాట్య కారణిగా రాణిస్తూనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఓ ఊపు ఊపేసింది. అయితే ఆమె మ్యారేజ్‌ చేసుకోకుండా ఒంటరిగా ఉండటానికి ఓ బలమైన కారణం ఉందట. తాను ఓ హీరోని ప్రేమించిందట. అయితే ఎంతో గాఢంగా ప్రేమించిన ఆ హీరో శోభనకి హ్యాండిచ్చాడట. ప్రేమలో మోసపోయిన బాధని తట్టుకోలేక పోయిన శోభన సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక తాను మ్యారేజ్‌ చేసుకోకూడదని అని నిర్ణయించుకుందట. అలా ఐదు పదుల వయసు దాటినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంది. మరి ఇదే కారణమా? దీనికంటే వేరే రీజన్స్ ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఓ అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకుంటుంది శోభన.Next Story

Most Viewed