కాబోయేవాడితో ఆ ఏడు రకాల యాంగిల్స్ ట్రై చేయాలని ఉంది: Urvashi Rautela

by Prasanna |
కాబోయేవాడితో ఆ ఏడు రకాల యాంగిల్స్ ట్రై చేయాలని ఉంది: Urvashi Rautela
X

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా తన పెళ్లికి సంబంధించి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. ఇటీవల వరుస ఐటమ్ సాంగ్స్‌తో యూత్‌ను ఊపేస్తున్న నటి రీసెంట్ ఇంటర్వూలో కెరీర్ అండ్ ఫ్యూచర్ ప్లాన్ గురించి మాట్లాడింది. ‘పెండ్లి హడావుడి అంటే చాలా ఇష్టం. నా మ్యారేజ్ గురించి చాలా డ్రీమ్స్ ఉన్నాయి. మరీ ఇంత ఫాంటసీ ఏమిటని అనుకోకపోతే..7 రకాలుగా వివాహం చేసుకోవాలనుంది. బీచ్‌, క్రూజ్‌, థీమ్‌ బేస్డ్‌, క్రైస్తవ, హిందూ, బెంగాలీ సంప్రదాయం, డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ఇలా సెవన్‌ వండర్స్‌ ఆస్వాదించాలని ఉంది. నాకు సరైన జోడు వెతుక్కోవడం కష్టమైన పనే. ఎందుకంటే లైఫ్ పార్ట్‌నర్‌లో చాలా క్వాలిటీస్ కోరుకుంటా. అందం, తెలివితోపాటు ప్రపంచం మీద కనీసం అవగాహన, సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌, మంచి వ్యక్తిత్వం కలిగివుండాలి. అలాంటి వాడే నా వాడు’ అంటూ చెప్పుకొచ్చింది. చివరగా సినిమా రంగంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పిన హాటీ భవిష్యత్‌ గురించి ముందే ఊహించడం కష్టమైనప్పటికీ ‘టైటానిక్‌’ లాంటి రొమాంటిక్‌ మూవీ చేయాలనుందని తెలిపింది.

Next Story