AP Politics: మంత్రిగా పవన్ కళ్యాణ్..కాకినాడలో అభిమానుల కేరింతలు

by Jakkula Mamatha |
AP Politics: మంత్రిగా పవన్ కళ్యాణ్..కాకినాడలో అభిమానుల కేరింతలు
X

దిశ, కాకినాడ: జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా కాకినాడ నగరంలో జనసైనికులు సందడి చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ సమక్షంలో మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న సమయంలో జనసైనికుడు మచ్చ గంగాధర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. బుధవారం సుమారు మధ్యాహ్నం 12 గంటల సమయంలో కాకినాడ జగన్నాధపురం వంతెన వద్ద గంగాధర్ భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు. పవన్ కళ్యాణ్ అను నేను రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అని అన్న సమయంలో బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచి రంగురంగుల బెలూన్స్‌ని ఎగురవేశారు.

ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ.. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కలిసి పని చేసిందన్నారు. వారి విధానాలు నచ్చడంతో రాష్ట్రంలోని ఓటర్లు భారీ విజయానందించారన్నారు. వైసీపీ హయాంలో అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని.. అటువంటివి ఏమీ లేకుండా ఈ కూటమి పాలనలో శుభ పాలన జరుగుతుందని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు శివ, కామేశ్వరరావు, బత్తి రాజు, నాగేశ్వరరావు, కుమారి, రత్నం తదితరులు పాల్గొన్నారు.Next Story

Most Viewed