12 నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం

by S Gopi |
12 నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోంది. ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో వినియోగదారుల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం(సీపీఐ) మేలో 4.75 శాతంగా నమోదైంది. ఇది 12 నెలల కనిష్ఠం అని కేంద్ర గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) బుధవారం తెలిపింది. అంతకుముందు ఏప్రిల్‌లో సైతం సీపీఐ ద్రవ్యోల్బణం 11 నెలల కనిష్టం 4.83 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. సమీక్షించిన నెలలో ఆహార ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 8.75 శాతం నుంచి 8.62 శాతానికి దిగొచ్చింది. అయితే, గతేడాది ఇదే నెలలో ఉన్న 3.3 శాతం కంటే అధికంగా ఉంది. గ్రామీణ ద్రవ్యోల్బణం 5.28 శాతానికి, పట్టణ ద్రవ్యోల్బణం 4.15 శాతానికి తగ్గింది. ఇక, మేలో కూరగాయల ద్రవ్యోల్బణం 27.3 శాతం, తృణధాన్యాలు 8.69, పప్పులు 17.14 శాతంగా ఉన్నాయి. ఇంధన, విద్యుత్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 4.24 శాతం నుంచి మే నెలలో 3.83 శాతానికి చేరింది. మరోవైపు, దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) మార్చిలో 5.4 శాతం నుంచి ఏప్రిల్ నెలలో 5 శాతానికి చేరిందని కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గతేడాది ఏప్రిల్‌లో ఐఐపీ సూచీ 4.6 శాతంగా నమోదైంది.Next Story

Most Viewed