మాజీ MLA జగ్గారెడ్డి కూతురు జయారెడ్డికి కీలక పదవి

by Satheesh |
మాజీ MLA జగ్గారెడ్డి కూతురు జయారెడ్డికి కీలక పదవి
X

దిశ, తెలంగాణ బ్యూరో: యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూతురు తూర్పు జయారెడ్డి నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్‌లో కొత్త మెంబర్లకు అవకాశం ఇచ్చారు. అన్ని జిల్లాల్లో వివిధ పోస్టుల కేడర్లలో 23 మందికి అవకాశం ఇచ్చారు. ఈ మేరకు ఇండియన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బీ.వీ శ్రీనివాస్ బుధవారం ఉత్తర్వులు రిలీజ్ చేశారు. ఇక పార్టీ అనుబంధ సంఘాలు, పార్టీ విభాగాలకు త్వరలోనే కొత్త కమిటీలు వేయనున్నారు. ఇందులో దాదాపు 80 శాతం యువతకే ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తున్నది. దీంతో గాంధీభవన్‌కు గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల నుంచి దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. స్థానిక నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు తర్వాత కొత్త కమిటీల్లో అవకాశం కల్పిస్తామని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.Next Story

Most Viewed