సినీ ప్రియులకు షాకింగ్ న్యూస్.. అల్లు అర్జున్ ‘పుష్ప-2’ వాయిదా!

by Hamsa |
సినీ ప్రియులకు షాకింగ్ న్యూస్.. అల్లు అర్జున్ ‘పుష్ప-2’ వాయిదా!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పుష్ప-2’. ఈ మూవీ 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీకి సిక్వెల్‌గా రాబోతుంది. ఇందులో హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటిస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ భారీ అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా ఇటీవల వచ్చిన సూసేకీ అగ్గిరవ్వ సాంగ్ మూవీని మొత్తం భారీ హైప్‌కు తీసుకెళ్లింది. గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ సాంగ్‌కుసంబంధించిన రీల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ మూవీని ఆగస్ట్ 15న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, పుష్ప-2కి సంబంధించిన వార్త అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఫిలిం ఎడిటర్‌తో పాటు వీఎఫ్ఎక్స్‌పై సుకుమార్ అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. అలాగే పుష్పకు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ కాకపోవడంతో వాయిదా వేయాలని మేకర్స్ అనుకుంటున్నారట. ఇందులో నిజమెంత ఉందనే విషయం తెలియనప్పటికీ ఈ వార్త వైరల్ కావడంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.Next Story

Most Viewed