ప్రభుత్వ పాఠశాలలు పట్టుకొమ్మలు : ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

by Aamani |
ప్రభుత్వ పాఠశాలలు పట్టుకొమ్మలు : ఎమ్మెల్యే  దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
X

దిశ, ఎల్బీనగర్ : ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్య ద్వారానే విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే అత్యధిక సంఖ్యలో విద్యార్థులు చదువుకుంటూ ప్రయోజకులు అవ్వాలనే మంచి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల ప్రతిష్టను పెంచే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారని తెలిపారు. వనస్థలిపురం డివిజన్ ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థిని, విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మంచి అధ్యాపకులు ఉత్తమ బోధన అందిస్తున్నారని తెలిపారు. చదువుల విషయంలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు గట్టి పోటీ ఇస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏం.ఈ.ఓ.హీర్యా నాయక్, కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి, మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, డివిజన్ భారస పార్టీ అధ్యక్షులు చింతల రవికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ లగ్గోని శ్రీధర్ గౌడ్, పాఠశాల హెడ్ మాస్టర్ దుర్గలత, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Advertisement

Next Story