తిరుపతిలో వైఎస్ఆర్ పేరు తొలగింపు

by srinivas |
తిరుపతిలో వైఎస్ఆర్ పేరు తొలగింపు
X

దిశ, వెబ్ డెస్క్: గత ప్రభుత్వం చేసిన తప్పులకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తోంది. 151 ఎమ్మెల్యేలున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే అరాచకాలకు పాల్పడింది. అంతకుముందు ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పనులకు వైసీపీ రంగులు వేసుకుంది. గత నాయకులు కట్టిన బిల్డింగులకు సైతం తమ పేర్లను రాసుకున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల దివంగత ఎన్టీఆర్, మహనీయుల విగ్రహాలు, వాళ్ల పేరుతో ఉన్న బోర్డులు తొలగించారు. తాజాగా ఆ ఫలితాలను అనుభవిస్తున్నారు.


విజయవాడలోని హెల్గ్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు ఉండేది. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్టీఆర్ పేరును తొలగించి తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో వైఎస్సార్ పేరున్న బోర్డులను తెలుగుదేశం పార్టీ శ్రేణులు తొలగిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ పేరు తీసివేసి మళ్లీ పేరునే పెట్టారు. తాజాగా తిరుపతిలో వైఎస్ఆర్ పేరును తొలగించారు. తిరుపతి తుడా కార్యాలయం ఎదుట ఉన్న వైఎస్సార్ భవన్ పేరును టీడీపీ నాయకులు తొలగించారు. ఎన్టీఆర్ భవన్‌గా పేరు మార్చారు. అయితే చేసిన తప్పుకు ఎన్నాళ్లైనా శిక్ష తప్పదనే సమేత ఇక్కడ రుజువు కావడంతో అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం ఏమీ అనలేని పరిస్థితి ఉంది. అందుకే అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలకు పాల్పడుకూడదని పలువురు చెబుతున్నారు.Next Story

Most Viewed