మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

by Anjali |
మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత బుధవారం ఉదయం 11. 27నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు మొత్తం 24 మంది మంత్రులు కూడా ప్రమాణం స్వీకారం చేశారు. అయితే ఏ మంత్రికి ఏ శాఖ ఇవ్వనున్నారని రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు నూతన మంత్రులతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా గతంలో ముఖ్యమంత్రిగా (2014-19)గా ఉన్నప్పటి పరిస్థితి, ఈ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి మంత్రులకు వివరించారు. రాష్ట్ర పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మంత్రులు అభీష్టాలు, వారి సమర్థత మేరకు రేపటిలోగా (గురువారం) శాఖలు కేటాయిస్తానని స్పష్టం చేశారు. మంత్రులకు కేటాయించిన శాఖకు పూర్తిస్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మంత్రులదేనని చంద్రబాబు వివరించారు.Next Story

Most Viewed