- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలాంటివి నన్ను ప్రభావితం చేయలేవు.. పవన్ సినిమా వదులుకోవడంపై యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), హరీశ్ శంకర్(Harish Shankar) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’(Ustad Bhagat Singh).

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), హరీశ్ శంకర్(Harish Shankar) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’(Ustad Bhagat Singh). ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న రెండో ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో పవన్‌కు జోడీగా.. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈక్రమంలో.. నిత్యం ఈ చిత్రానికి సంబంధించిన వార్తలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొద్ది కాలంగా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీలో సాక్షి వైద్య కూడా కీలక పాత్రలో పాత్రలో కనిపించనున్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాక్షి వైద్య ఈ విషయంపై స్పందించి క్లారిటీ ఇచ్చింది. ‘‘వైరల్ వార్తలు నిజమే.
అందుకే వదులుకోవాల్సి వచ్చింది..
నాకు ‘ఉస్తాద్‌భగత్‌సింగ్’లో కీలక పాత్రలో నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ సమయంలో నా కుటుంబం అత్యవసర పరిస్థితి కారణంగా.. నేను వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో మూవీ టీమ్ నాకు ఫోన్ చేసి రేపటి నుంచి షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. నేను వెళ్లలేని పరిస్థితుల్లో తేదీలు సర్దుబాటుచేయలేక మంచి అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది. కానీ నేను గతంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినందుకే ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ నుంచి తొలగించారని వార్తలు వస్తున్నాయి. ఆడియన్స్ పాయింట్‌లో అది నిజమేనేమో.. కానీ నేను అలాంటివి పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ ముందుకుసాగుతా.
అవి నన్ను ప్రభావితం చేయలేవు..
అలాంటివి నన్ను నా కెరీర్‌ను ప్రభావితం చేయలేవు’’ అని చెప్పుకొచ్చింది. కాగా.. ఈ అమ్మడు తెలుగులో చేసిన రెండు సినిమాలు ఏజెంట్, గాండీవధారి అర్జున బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సాక్షి వైద్య త్వరలో ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చార్మింగ్ స్టార్ శర్వానంద్‌కు జోడీగా కనిపించనుంది. రాబ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది. జనవరి 14న థియేటర్స్‌లోకి రాబోతుంది.
Read More..






