- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజా సాబ్ నుంచి ‘నాచే నాచే’ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి(Maruti) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ హారర్ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’(Raja Saab).

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి(Maruti) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ హారర్ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’(Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్(TG Vishwa Prasad) రూపొందిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్(Malavika Mohanan), రిద్ధి కుమార్(Riddhi Kumar), నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న గ్రాండ్‌గా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.
ఇక ఇప్పటికే ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ‘రెబల్ సాబ్’ ‘సహానా సహానా’, ‘రాజే యువరాజే’ మ్యూజిక్ బిట్ సినిమాపై సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ది మోస్ట్ అవైటెడ్ ‘నాచే నాచే’ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. అయితే సోమవారం ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ఈ ఫుల్ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాట 1982లో మిథున్ చక్రవర్తి నటించిన డిస్కో డ్యాన్సర్ సినిమాలోని సూపర్ హిట్ నంబర్ ‘ఆవా ఆవా కోయి యహాన్ నాచే’కు ఆధునిక రీమిక్స్‌గా రూపొందింది.
ఈ పాటలో ప్రభాస్ తన స్టైలిష్ స్వాగ్‌తో పాటు డ్యాన్స్‌లోనూ కొత్త కోణాన్ని చూపించారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ ముగ్గురు బ్యూటీలు తమ గ్లామర్‌తో పాటు స్టెప్పుల విషయంలోనూ పోటీపడుతూ కనిపించారు. ప్రభాస్‌కు జోడీగా ఈ ముగ్గురు హీరోయిన్లు కనిపించడం ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. గ్రీస్‌లోని అందమైన లొకేషన్లలో భారీ స్థాయిలో షూట్ చేయడంతో పాట విజువల్స్ గ్రాండ్‌గా కనిపిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా నాచే నాచే ఫుల్ లిరికల్ సాంగ్‌ను వినేయండి.
Read More..
నారి నారి నడుమ మురారి నుంచి భల్లే భల్లే సాంగ్ ప్రోమో రిలీజ్.. మెస్మరైజ్ చేస్తున్న లిరిక్స్






