- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నారి నారి నడుమ మురారి నుంచి భల్లే భల్లే సాంగ్ ప్రోమో రిలీజ్.. మెస్మరైజ్ చేస్తున్న లిరిక్స్
బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన హీరో శర్వానంద్(Sharwanandh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన హీరో శర్వానంద్(Sharwanandh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న చిత్రాల్లో ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari) ఒకటి. సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్(Samyukatha Menon), సాక్షి వైద్య(Sakshi Vaidhya) హీరోయిన్లుగా నటిస్తున్నారు.
విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. అయితే ఇందులో టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు కామియో రోల్ ప్లే చేస్తున్నారు. ఇక ఈ మూవీ సంక్రాంతి కానుకగా సంక్రాంతి 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అన్ని అప్డేట్స్ అంచనాలను పెంచగా.. తాజాగా ఈ మూవీ నుంచి భల్లే భల్లే సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.
‘ఈ సంక్రాంతికి ప్రతి తెలుగు హృదయాన్ని ప్రతిధ్వనించే శ్రావ్యత.. నారి నారి నడుమ మురారి నుండి భల్లే భల్లే ప్రోమో ఇప్పుడు విడుదల అయింది.. రేపు సాయంత్రం 5:49 గంటలకు పూర్తి పాట విడుదల కానుంది.. జనవరి 14 సాయంత్రం 5:49 గంటల నుండి థియేటర్లలో సంక్రాంతి పండుగను జరుపుకుందాం’ అంటూ రాసుకొచ్చారు. ఇక ట్రెడిషనల్ థీమ్‌లో సాగే ఈ పాట లిరిక్స్ మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే ఇది శర్వానంద్ అండ్ సాక్షి వైద్యల మధ్య సాగే పాట. ఆమె అందాన్ని పొగుడుతూ కేరళలలో జరిగే ఓ వేడుకలో శర్వానంద్ పాడుతున్నట్ల సాంగ్‌ను చూస్తే తెలుస్తోంది.
Read More..






